Para Powerlifing World Cup : పారా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ కప్లో భారత బృందం బోణీ అదిరింది. ఒకటి కాదు రెండు కాదు తొలిరోజే ఏకంగా నాలుగు పతకాలు కొల్లగొట్టారు లిఫ్టర్లు. బీజింగ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఒక పసిడి, ఒక రజతం.. రెండు కాంస్యాలతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. వెటరన్ లిఫ్టర్ జాబీ మాథ్యూ ( Joby Mathew) అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ ఖాతాలో పసిడి చేరింది. తొలి ప్రయత్నంలో విఫలమైన మాథ్యూ.. వరుసగా 145, 150 కిలోలు ఎత్తి స్వర్ణం గెలుపొందాడు.
ఆదివారం ఆరంభమైన పోటీల్లో లిఫ్టర్ గుల్ఫమ్ అమీద్ దేశానికి తొలి పతకం అందించాడు. పురుషుల 59 కిలోల విభాగంలో 145 కిలోలు ఎత్తిన అతడు మూడో స్థానంలో నిలిచి కంచు మోత మోగించాడు. అనంతరం 72కిలోల కేటగిరీలో రెట్టించిన ఉత్సాహంతో పోటీపడిన రాముభాయ్ బంభవతొలి ప్రయత్నంలోనే 151 కిలోలు ఎత్తాడు. తదుపరి రెండు దఫాల్లో వరుసగా 155 కిలోలు, 156 కిలోలు ఎత్తినా వాటిని పరిగణించలేదు. అయినా సరే అతడికి కాంస్యం దక్కింది.
India starts their campaign with a bang at the #ParaPowerlifting🏋♀ World Cup in Beijing🇨🇳. Our para powerlifters bagged a total of 4 medals🏅 on Day 1.
Meet our medallists👇🏻
Joby Mathew: Gold🥇 & Silver🥈 in Masters Category in total & best lifts respectively
Gulfam Ahmed:… pic.twitter.com/z38KvRmLL4
— SAI Media (@Media_SAI) June 22, 2025
చైనా ఆతిథ్యమిస్తున్న పారా వరల్డ్ కప్లో 40 దేశాలకు చెందిన లిఫ్టర్లు పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో సత్తా చాటినవాళ్లకు వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2026, పారాలింపిక్స్ 2028 బెర్తులు దక్కుతాయి. అందుకే.. శక్తినంతా కూడదీసుకొని మరీ భారీ బరువులు ఎత్తేందుకు సిద్ధమయ్యారు లిఫ్టర్లు.