Indravelli | ఇంద్రవెల్లి : మండలంలోని ముత్నూర్ గ్రామానికి సమీపంలో ఉన్న గురుకులం పాఠశాలలో విద్యార్థులతో శ్రమదానం చేయించి పిచ్చి మొక్కలు తొలగించే పనులు చేయించడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చూడడానికి పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులకు తమ పిల్లలు పిచ్చి మొక్కలు, పిచ్చి గడ్డి తొలగిస్తూ కనిపించారు.
దీంతో తీవ్ర ఆగ్రహంతో ఆందోళనకు లోనయ్యారు. తమ పిల్లలను చదువుల కోసం పంపించామని, పనులు చేసేందుకు కాదని ఆవేదనవ్యక్తం చేశారు. ఉపాధ్యాయురాలు మాత్రం తమ పిల్లలతో పనులు చేయిస్తున్నారని వాపోతున్నారు. పిల్లలు పనులు చేస్తుంటే పాఠశాలలో పని చేసే వర్కర్లు మాత్రం చూస్తు ఉన్నారని తెలిపారు. పనులు చేసేందుకు ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసి పనులు చేయించుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీప్రియను సంప్రదించగా పిల్లలతో పనులు చేయించ లేదని తెలిపారు. ఆదివారం సెలవు కావడంతో తరగతి గదుల్లో ఉంటున్న విద్యార్థులను ఒక ప్రాక్టికల్ లాగా కాలక్షేపం కోసం పాఠశాల అవరణలోకి తిసుకోచ్చి ఇతర కూలీలు. ట్రాక్టర్ బ్లేడ్ తో కోనసాతున్న ప్లే గ్రౌండ్ పనుల్లో భాగంగా అక్కడక్కడా ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారని వివరించారు.