లండన్ : దశాబ్దాల ఐసీసీ ట్రోఫీ కలను నెరవేర్చుకునేందుకు దక్షిణాఫ్రికా వడివడిగా ముందుకు సాగుతున్నది. సెషన్ సెషన్‌కూ ఆధిక్యం చేతులు మారుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతున్న ఆ జట్టు.. ‘గద’ను చేజిక్కించుకునేందుకు గాను 69 పరుగుల దూరంలో నిలిచింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 282 పరుగుల ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు 213/2తో గెలుపు దిశగా సాగుతున్నారు. ఓపెనర్ ఎయిడెన్ మార్క్మ్ (159 బంతుల్లో 102 నాటౌట్, 11 ఫోర్లు) తన కెరీర్లో చిరస్మరణీయ శతకంతో కదం తొక్కగా కెప్టెన్ టెంబ బవుమా (121 బంతుల్లో 65 నాటౌట్, 5 ఫోర్లు) అదరగొట్టడంతో సఫారీలు లక్ష్యానికి చేరువయ్యారు. అంతకుముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ (58 నాటౌట్) పోరాడాడు. ఆట తొలి రెండు రోజుల మాదిరిగా కాకుండా మూడో రోజు పూర్తిగా ఎండ కాయడంతో బౌలర్ల పప్పులేమీ ఉడకలేదు. రెండ్రోజుల్లో 28 వికెట్లు తీసిన ఇరు జట్ల పేసర్లు.. మూడో రోజు తీసింది మూడు వికెట్లే.. మరో రెండ్రోజుల ఆట మిగిలిఉన్న ఈ మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప దక్షిణాఫ్రికా గెలుపును అడ్డుకోవడం కంగారూలకు కష్టమే!
భోజన విరామానికి వెళ్లొచ్చి 282 పరుగుల ఛేదనను ఆరంభించిన సఫారీలకు మూడో ఓవర్లోనే తొలి దెబ్బ తగిలినా తర్వాత నిలబడింది. మార్క్మ్త్రో పాటు మల్డర్ (27), బవుమా నిలకడ ముందు కంగారూల ఆటలు సాగలేదు. మూడో ఓవర్లో స్టార్క్.. రికెల్టన్ (6)ను ఔట్ చేసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేశాడు. కానీ మార్క్మ్,్ర మల్డర్ (27) ఆసీస్ పేసర్లపై ఎదురుదాడికి దిగారు. వన్డే తరహాలో ఆడిన ఈ ద్వయం.. ఆసీస్ పేస్ త్రయంతో పాటు స్పిన్నర్ లియాన్‌ను సమర్థవంతంగా అడ్డుకోవడమే గాక ఓవర్‌కు 4 పరుగుల రన్‌రేట్‌ను మెయింటెన్ చేస్తూ లక్ష్యం దిశగా సాగింది. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన మార్క్మ్.్ర. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం కంగారూలకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు.
అయితే రెండో వికెట్‌కు 93 బంతుల్లో 61 పరుగులు జోడించిన మార్క్మ్,్ర మల్డర్ జోడీని 18వ ఓవర్లో స్టార్క్ విడదీశాడు. మల్డర్ స్థానంలో వచ్చిన కెప్టెన్ బవుమా 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్లిప్స్‌లో స్మిత్ క్యాచ్ జారవిడవడంతో ఊపిరిపీల్చుకున్నాడు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. టీ విరామం తర్వాత కమిన్స్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన మార్క్మ్ అర్ధ శతకం సాధించాడు. మరో ఎండ్‌లో కాలికి గాయమై పరుగెత్తడానికి ఇబ్బందిపడ్డా బవుమా పోరాటం కొనసాగించాడు. ఈ జోడీ ఒక్కో పరుగు జతచేస్తూ లక్ష్యాన్ని కరిగించింది. మార్క్మ్-్రబవుమా ద్వయాన్ని విడదీయడానికి కమిన్స్ పదే పదే బౌలర్లను, ఫీల్డర్లను మార్చినా ఫలితం మాత్రం మారలేదు. లియాన్ ఓవర్లో సింగిల్‌తో బవుమా కూడా ఫిఫ్టీ మార్కును అందుకున్నాడు. ఆట ముగుస్తుందనగా హాజిల్‌వుడ్ ఓవర్లో మిడ్ వికెట్ దిశగా బంతిని బౌండరీకి తరలించి అజేయమైన మూడో వికెట్‌కు మార్క్మ్-్రబవుమా జోడీ 143 పరుగులు జోడించింది.
రెండో రోజు ఆటలోనే 200 పరుగుల ఆధిక్యాన్ని దాటిన ఆస్ట్రేలియా.. ఓవర్ నైట్ స్కోరు (144/8)కు మరో 63 పరుగులు జోడించింది. 25 ఓవర్ల పాటు ఆ జట్టు సఫారీ పేసర్లను నిలువరించింది. హాజిల్‌వుడ్ (17) అండగా స్టార్క్ పోరాడాడు. ఆట రెండో రోజు కేరీతో కలిసి 8వ వికెట్‌కు 61 పరుగులు జతచేసిన అతడు.. మూడో రోజు చివరి వరుస బ్యాటర్ హాజిల్‌వుడ్‌తో కలిసి 10వ వికెట్‌కు 59 రన్స్ జోడించాడు. లియాన్ (2) త్వరగానే నిష్క్రమించినా ఈ ద్వయం దక్షిణాఫ్రికాను విసిగించింది. ఈ క్రమంలో స్టార్క్ తన కెరీర్లో 11వ టెస్టు అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. ఎట్టకేలకు 65వ ఓవర్లో మార్క్మ్.్ర. హాజిల్‌వుడ్‌ను ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 212,
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 138.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 207 ఆలౌట్ (స్టార్క్ 58*, కేరీ 43, రబాడా 4/59, ఎంగిడి 3/38);
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 56 ఓవర్లలో 213/2 (మార్క్మ్ 102*, బవుమా 65*, స్టార్క్ 2/53)