Mark Wood : పొట్టి ప్రపంచ కప్ ముందు పాకిస్థాన్(Pakistan)కు ఘోర పరాభవం ఎదురైంది. బాబర్ ఆజాం సారథ్యంలోని పాక్ ఇంగ్లండ్(England) ధాటికి 2-0తో సిరీస్ చేజార్చుకుంది. గురువారం జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పేసర్ మార్క్ వుడ్ (Mark Wood) వేసిన బౌన్సర్ మ్యాచ్‌కే హైలెట్ అని చెప్పాలి. అతడి సూపర్ ఫాస్ట్ డెలివరీకి పాకిస్థాన్ బ్యాటర్ అజాం ఖాన్ (Azam Khan) డకౌటయ్యాడు.
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన నాలుగో టీ20లో వుడ్ నిప్పులు చెరిగాడు. బుల్లెట్ లాంటి బంతులతో పాక్ బ్యాటర్లను హడలెత్తించాడు. 11వ ఓవర్లో 142 కిలోమీటర్ల వేగంతో వుడ్ సంధించిన బంతిని తప్పించుకునేందకు అజాం శతవిధాలా ప్రయత్నించాడు.
Absolute savagery from Mark Wood 🤯#EnglandCricket | #ENGvPAK pic.twitter.com/zrrksjNF95
— England Cricket (@englandcricket) May 30, 2024
కానీ, బంతి అతడి గ్లోవ్స్, భుజానికి తాకుతూ వెళ్లింది. వికెట్ల వెనకాల కాచుకొని ఉన్న వికెట్ కీపర్ జోస్ బట్లర్ చక్కగా క్యాచ్ పట్టాడు. అంతే.. 5 బంతులాడిన అజాం ఖాన్ సున్నాకే పెవిలియన్ బాట పట్టాడు. వుడ్(235), లివింగ్‌స్టోన్(227) విజృంభణతో పాక్ 157 రన్స్‌కే ఆలౌటయ్యింది. అనంతరం ఫిలిప్ సాల్ట్(45), బట్లర్(39) మెరుపులతో ఇంగ్లండ్ స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది.