Forex Reserves | దేశీయ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు దిగి వచ్చాయి. ఈ నెల 24తో ముగిసిన వారానికి రెండు బిలియన్ డాలర్లు తగ్గి 646.67 బిలియన్ డాలర్లకు పడిపోయాయని శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఆర్బీఐ వెల్లడించింది. అంతకుముందు ఈనెల 17తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4.54 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 648.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) 1.51 బిలియన్ల డాలర్లు తగ్గి 567.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. బంగారం రిజర్వ్ నిల్వలు 482 మిలియన్ డాలర్లు పతనమై 56.71 బిలియన్ డాలర్లు, ఎస్డీఆర్స్ 33 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 18.12 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి. అంతర్జాతయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) లో రిజర్వ్ నిల్వలు మిలియన్ డాలర్లు తగ్గి 4.33 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.