న్యూఢిల్లీ : లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మార్క్ వుడ్ ఐపీల్ తుది అంకానికి దూరం కానున్నాడు. వచ్చే నెలలో తన భార్య సారా కాన్పుకు స్వదేశానికి వెళ్తున్నందున మార్క్ వుడ్ అందుబాటులో ఉండడని జట్టు యాజమాన్యం తెలిపింది.
మార్క్ వుడ్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. లక్నో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. ఐపీఎల్ క్వాలిఫయర్స్ మే 23, 26 తేదీలలో ఫైనల్స్ 28న జరుగనున్నాయి. ఐపీఎల్ ముగిసిన తరువాత ఇంగ్లండ్ జట్టు జూన్ 1నుంచి ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు ఆడనున్నది.