వార్సా: ఎనిమిది నెలల చిన్నారి గుండె ఆపరేషన్ కోసం తాను గెలిచిన ఒలింపిక్ పతకాన్నే వేలానికి పెట్టింది పోలండ్ జావెలిన్ త్రో క్రీడాకారిణి మారియా ఆండ్రెజెక్. టోక్యో ఒలింపిక్స్లో తాను సాధించిన రజత పతకాన్ని వేలానికి పెట్టి దాని ద్వారా వచ్చిన మొత్తంతో ఆ చిన్నారి వైద్యం చేయించేందుకు ముందుకువచ్చింది. ఆన్లైన్ ద్వారా వేలం జరుగగా.. పోలండ్ సూపర్ మార్కెట్ దిగ్గజ సంస్థ జాబ్కా ఆ పతకాన్ని 1.25 లక్షల డాలర్లకు దక్కించుకుంది. అయితే బిడ్ గెలిచినా.. అందుకు సంబంధించిన డబ్బుతో పాటు పతకాన్ని కూడా మారియాకే తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది.