Marathan Runner : పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మారథాన్ రన్నర్ రెబెక్కా చెప్టెగీ (Rebecca Cheptegi) మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ఉగాండాకు చెందిన ఆమె రెండు రోజుల క్రితం కాలిన గాయాలతో దవాఖానలో చేరింది. బాయ్‌ఫ్రెండ్ పెట్రోల్ (Petrol) పోసి నిప్పు అంటించడంతో రెబెక్కా తీవ్ర గాయాల పాలైంది. ఆమెను బతికించేందుకు కెన్యా వైద్యులు ఎంతగానో ప్రయత్నిచారు. కానీ, ఫలితం లేకపోయింది. రెండు రోజులు మృత్యువుతో పోరాడిన రెబెక్కా గురువారం ఉదయం 5:30 గంటలకు తనువు చాలించింది. 75 శాతం కాలిన గాయాలు కావడంతో ఆమె కోలుకోలేకపోయిందని వైద్యులు చెప్పారు.
అసలేం జరిగిందంటే..? కెన్యాకు చెందిన డిక్సన్ డియెమ మరగచ్‌తో 33 ఏండ్ల రెబెక్కా కొన్ని రోజులుగా సహజీవనం చేస్తోంది. అయితే.. తరచూ అతడు ఆమెను వేధింపులకు గురి చేసేవాడని ఇరుగుపొరుగు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1, ఆదివారం మధ్యాహ్నం 2: 00 గంటలకు ఆమెపై అతడు దాష్టీకానికి పాల్పడ్డాడు. ఉన్మాదిలా మారిన అతడు రెబెక్కాను అంతమొందించాలని అనుకున్నాడు. చర్చి నుంచి ఆమె తిరిగొస్తుండగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
Olympic Marathon Runner Rebecca Cheptegei Dies After Being Set on Fire in Gasoline Attack by Boyfriend https://t.co/0XmMBe6BJV
— People (@people) September 5, 2024
‘మరంగచ్ ఆదివారం మధ్యాహ్నం కెన్యాలోని రెబెక్కా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె పిల్లలతో కలిసి చర్చికి వెళ్లింది. రెబెక్కా చర్చి నుంచి ఆమె తిరిగొస్తుండగా మరంగచ్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పింటించాడు. వాళ్లిద్దరూ తరచూ గొడవపడేవాళ్లని.. ఈ సంఘటనకు గృహ హింసనే కారణం’ అని కెన్యా పోలీసులు వెల్లడించారు. ఈ మధ్యే ముగిసిన పారిస్ విశ్వ క్రీడల్లో రెబెక్కా మారథన్‌లో పతకం గెలవలేదు. పోటీలో ఆమె 44వ స్థానంలో నిలిచింది.