హైదరాబాద్ : ఉప్పల్ నల్లచెరువు పరిశీలించడానికి వచ్చిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Mayor Vijayalakshmi)కి చేదు అనుభవం ఎదురయింది మేయర్ విజయలక్ష్మిపై ఉప్పల్(Uppal) వాసులు తిరగబడ్డారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉప్పల్ నల్లచెరువును పరిశీలించడానికి వచ్చిన మేయర్ మేయర్‌ను స్థానికులు అడ్డుకున్నారు(People obstructed).
ఉప్పల్‌లో ఏం పనులు జరగట్లేదని, గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫల మైందని బీఆర్ఎస్ నేతలతో పాటు భాగ్య నగర ఉత్సవ సమితి సభ్యులు మేయర్‌ను నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కాగా, తమపై దాడి చేశారని ఆరోపిస్తూ భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Sabitha Indra Reddy | మీరు కేసీఆర్ సార్‌తోనే ఉండండి.. సబితక్కకు ఓ యువకుడి రిక్వెస్ట్.. వీడియో
Niranjan Reddy | ప్రతిపక్షాలను తిట్టడానికి ఒక మంత్రిని పెట్టుకోండి : నిరంజన్ రెడ్డి
Harish Rao | గురువులకు మద్దతుగా పిడికిలెత్తిన గురుకుల విద్యార్థులు.. హరీశ్‌రావు ట్వీట్