Paralympics 2024 | పారా షూటర్ మనీశ్‌కు రజతం.. భారత్ ఖాతాలో నాలుగో పతకం
Paralympics 2024 : పారిలింపిక్స్ రెండో రోజు భారత క్రీడాకారులు పతకాల వేటలో దూసుకెళ్తుస్తున్నారు. ఇప్పటికే ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు రాగా.. షూటర్ మనీశ్ నర్వాల్(Manish Narwal) రజతంతో మెరిశాడు.
Paralympics 2024 : పారిలింపిక్స్ రెండో రోజు భారత క్రీడాకారులు పతకాల వేటలో దూసుకెళ్తుస్తున్నారు. ఇప్పటికే ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు రాగా.. షూటర్ మనీశ్ నర్వాల్(Manish Narwal) రజతంతో మెరిశాడు. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్లో మనీశ్ సూపర్ గురితో వెండి వెలుగులు విరజిమ్మాడు. దాంతో, భారత్ ఖాతాలో ఇప్పటివరకూ నాలుగో పతకం చేరింది.
శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో మనీశ్ గురి తప్పలేదు. మూడు పాయింట్ల తేడాతో గోల్డ్ మెడల్ చేజార్చుకున్నాడు. కొరియా పారా షూటర్ జియోంగ్డు జో(Jeongdu Jo)అగ్రస్థానం దక్కించుకోగా.. మనీశ్ 234.9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి వెండి పట్టేశాడు. టోక్యో పారాలింపిక్స్‌లో మనీశ్ 50 మీటర్ల పిస్టల్ విభాగంలో బంగారు పతకం గెలిచిన విషయం తెలిసిందే.
SILVER 🥈 For INDIA 🇮🇳
Manish Narwal wins silver medal in the Men’s 10m Air Pistol SH1 Final with a score of 234.9 🙌#Paris2024 #Cheer4Bharat #Paralympics2024 #ParaShooting@mansukhmandviya @MIB_India @PIB_India @IndiaSports @ParalympicIndia @PCI_IN_Official @Media_SAI… pic.twitter.com/tdWTGStMpA
— Doordarshan Sports (@ddsportschannel) August 30, 2024
పసిడితో బోణీ..
అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పారా షూటర్లు అవనీ లేఖరా(Aanvi Lekhari) పసిడితో గర్జించగా.. మోనా అగర్వాల్(Mona Agarwal) కంచు మోత మోగించింది. వీళ్ల స్ఫూర్తితో అథ్లెట్ ప్రీతి పాల్(Preethi Pal) సైతం సంచలనం సృష్టించింది. ట్రాక్ విభాగంలో దేశానికి తొలి పతకం సాధించి పెట్టింది.
BRONZE 🥉 For INDIA 🇮🇳
🏃♀️ Preethi Pal wins bronze medal in the Women’s 100m T35 Final.#Paris2024 #Cheer4Bharat #Paralympics2024 #ParaAthletics @mansukhmandviya @MIB_India @PIB_India @IndiaSports @ParalympicIndia @PCI_IN_Official @Media_SAI @AkashvaniAIR @DDNational… pic.twitter.com/igEYUhtpmu
— Doordarshan Sports (@ddsportschannel) August 30, 2024
శుక్రవారం జరిగిన మహిళల 100 మీటర్ల టీ35 ఫైనల్లో ప్రీతి కాంస్యం పతకం కొల్లగొట్టింది. దాంతో, పారిస్ పారిలింపిక్స్లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. 100 మీటర్ల ఫైనల్లో ప్రీతి చిరుతలా పరుగెత్తింది. 14.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న ఆమె మూడో స్థానంతో కాంస్యం ముద్దాడింది.
HISTORY REPEATED! 🥇
Avani Lekhara strikes GOLD again in Paris Paralympics 2024. #Paris2024 #Cheer4Bharat #Paralympics2024 @mansukhmandviya @IndiaSports @MIB_India @PIB_India @DDNewslive @ParalympicIndia @PCI_IN_Official @DDIndialive @AkashvaniAIR @Media_SAI @AvaniLekhara pic.twitter.com/KqGove2DUq— Doordarshan Sports (@ddsportschannel) August 30, 2024
ఆద్యంతం ఉత్కంఠ రేపిన పారా షూటింగ్ ఫైనల్లో తొలుత అవని వెనకబడింది. అయితే.. తొలి రౌండ్ నుంచి ముందంజలో ఉన్న దక్షిణ కొరియా పారా షూటర్ లీ యున్రీ (Lee Yunri)ఆఖరి రౌండ్లో తడబడింది. యున్రీ 6.8 పాయింట్లకే పరిమితమవ్వగా.. అవని చెక్కు చెదరని గురితో 10.5 పాయింట్లు సాధించింది. దాంతో, మొత్తంగా 249.7 పాయింట్లతో రికార్డు నెలకొల్పిన భారత పారా షూటర్ పసిడి వెలుగులు విరజిమ్మింది.
ఇవి కూడా చదవండి
- Madigadda barrage | మేడిగడ్డకు 1.75 లక్షల క్యూసెక్కుల నీరు
- Uttam kumar reddy | చెరువులను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : మంత్రి ఉత్తమ్
- Kolkata Protests | కోల్‌కతా ఘటనపై మహిళల నిరసన : లాకెట్ ఛటర్జీ సహా పలువురి అరెస్ట్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్‌లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

