Kolkata Protests : కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు వ్యతిరేకంగా కోల్కతాలో విపక్షాలు, మహిళా, ప్రజా సంఘాల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ మహిళా మోర్చా శుక్రవారం కోల్కతా వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా విపక్షాల నిరసనల నేపధ్యంలో నగరమంతటా పెద్దసంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు. ఇక బీజేపీ మహిళా మోర్చా నిరసనల సందర్భంగా ఆ పార్టీ నేత లాకెట్ ఛటర్జీ సహా పలువురు నేతలు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు మహిళలపై హత్యాచార ఘటనలను నియంత్రించేందుకు ఈ తరహా నేరాలపై ఉక్కుపాదం మోపేలా కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం మరో లేఖ రాశారు.దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళలపై నేరాలు పెచ్చుమీరుతున్నాయని మోదీకి రాసిన లేఖలో దీదీ ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :