Allu Arjun Pushpa 2 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా డిసెంబర్ 06 న రావడం ఖాయం అని.. ఈ డేట్లో మార్పులేవి లేవని నిర్మాత రవి శంకర్ వెల్లడించారు. అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’. పుష్ప సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 06న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. ఇక క్లైమాక్స్ అనంతరం శరవేగంగా పోస్ట్ ప్రోడక్షన్ పనులు స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్ ప్రతాప్, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా గురించి నిర్మాతను మీడియా ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నిర్మాత.
ఆరు నూరైనా పుష్ప 2 వచ్చేది డిసెంబర్ 06వ తేదీనే. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్లో పుష్ప 2 ఫస్ట్ ఆఫ్ ఎడిటింగ్ అయిపోతుంది. అక్టోబర్లో 06 వరకు సెకండ్ ఆఫ్ ఎడిటింగ్ పనులు అయిపోతాయి. నవంబర్ 20 వరకు కాపీ ఇచ్చేసి ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయాలని ప్లాన్ ఉంది. నవంబర్ 25 కల్లా సెన్సార్ కూడా చేయిస్తాం అంటూ రవిశంకర్ వెల్లడించాడు.
Mythri Producer Ravi gari Confidence 💥
•At any cost hitting theaters in dec
•Two songs will release from SEP end & OCT” పుష్పరాజ్ బాక్స్ఆఫీస్ ఆగమానం ” DEC 6th🔥@alluarjun #Pushpa2TheRule pic.twitter.com/r2jPH0Q5sB
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) August 30, 2024
Also read..