హైదరాబాద్ : రాష్ట్రంలో టూరిజం(Tourism) అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించండి. ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy | )అన్నారు. స్పీడ్‌పై (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రాజెక్టులపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటితోపాటు హెల్త్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.
హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మనకున్న వనరుల అభివృద్ధికి అవసరమైనచోట పీపీపీ విధానాన్ని అవలంభించండి. అవకాశం ఉన్నచోట హెలీ టూరిజం అభివృద్ధికీ ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.