WCPL 2024 : మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో బార్బడోస్ రాయల్స్(Babados Royals) చాంపియన్‌గా అవతరించింది. తొలి సీజన్ విజేత ట్రిన్బగో నైట్ రైడర్స్(Trinbago Knight Riders)కు షాకిచ్చి వరుసగా రెండోసారి కప్‌ను కొల్లగొట్టింది. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో హేలీ మాథ్యూస్(Hayley Mathews) సారథ్యంలోని బార్బడోస్ నాలుగు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. పేసర్ అలియాహ్ అల్లెనె(21/4)బంతితో టీకేర్ను కుప్పకూల్చగా.. అనంతరం చమరి ఆటపట్టు (39 నాటౌట్) దంచికొట్టడంతో బార్బడోస్ జట్టు విజేతగా నిలిచింది.
డబ్ల్యూసీపీఎల్ మూడో సీజన్ ఆరంభం నుంచి అదరగొట్టిన బార్బడోస్ జట్టు ఫైనల్లోనూ దుమ్మరేపింది. తొలి సీజన్ చాంపియన్ ట్రిన్బగ్ నైట్ రైడర్స్‌ను చిత్తుగా ఓడించి రెండో ట్రోఫీని ముద్దాడింది. బ్రియాన్ లారా స్టేడియంలో టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన రాయల్స్.. ట్రిన్బగ్ నైట్ రైడర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసింది.
TWO-TIME CHAMPIONS! 🏆🏆 pic.twitter.com/gq8ckRJzEv
— Barbados Royals (@BarbadosRoyals) August 29, 2024
పేసర్ అలియాహ్ అల్లెనె 4 వికెట్లతో టీకేఆర్ టాపార్డర్‌ను కుప్పకూల్చింది. ఆమె చెలరేగడంతో టీకేఆర్ అమ్మాయిలంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఆల్‌రౌండర్ శిఖా పాండే (28 ) ఒంటరి పోరాటం చేసింది. దాంతో ట్రిన్బగో నైట్ రైడర్స్ 8 వికెట్ల నష్టానికి 93 రన్స్ కొట్టింది.
How do we frame a video? 🥲💗
pic.twitter.com/OtocRjI6tn— Barbados Royals (@BarbadosRoyals) August 29, 2024
ఆ తర్వాత ఛేదనలో బార్బడోస్ రాయల్స్ స్టార్ చమరి ఆటపట్టు(39 నాటౌట్) టీకేఆర్ బౌలర్లను ఆడుకుంది. దాంతో, రాయల్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది చరిత్ర సృష్టించింది. సంచలన స్పెల్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పిన అలియాప్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైంది. ఇక టోర్నీ ఆసాంతం రాణించిన మాథ్యూస్ (147 పరుగులు, 11 వికెట్లు) ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకుంది.