అంత్యక్రియలకు హాజరయ్యారని బహిష్కరణ
కులపెద్దల మాట వినకుండా కన్న తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారన్న కారణంతో ఓ మహిళ సహా ఐదు కుటుంబాలను బహిష్కరించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రామారెడ్డి (సదాశివనగర్), జనవరి 6: కులపెద్దల మాట వినకుండా కన్న తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారన్న కారణంతో ఓ మహిళ సహా ఐదు కుటుంబాలను బహిష్కరించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని ఓ సామాజికవర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఓ వర్గానికి చెందిన వ్యక్తి తల్లి గత ఆగస్టులో చనిపోయింది.
అదే గ్రామంలో ఉండే ఆమె కూతురును అంత్యక్రియలకు వెళ్లొద్దని కుల పెద్దలు ఆదేశించారు. వారి మాట వినకుండా అంత్యక్రియలకు హాజరు కావడంతో ఆమె సహా ఐదు కుటుంబాలను కులపెద్దలు బహిష్కరించారు. వారితో ఎవరైనా మాట్లాడితే రూ.5 వేల జరిమానా విధిస్తామని చాటింపు వేయించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

