INDW VS NZW : చావోరేవో పోరులో భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్లు ప్రతీకా రావల్ (122), స్మృతి మంధాన(109) న్యూజిలాండ్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ బౌండరీలతో రెచ్చిపోయారు. వరల్డ్ కప్ చరిత్రలోనే రికార్డు భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు గట్టి పునాది వేశారిద్దరూ. రెండొందలు జోడించిన ఈ ద్వయం వెనుదిరిగాక. జెమీమా రోడ్రిగ్స్(76 నాటౌట్) విధ్వంసక హాఫ్ సెంచరీతో స్కోర్‌బోర్డును ఉరికించింది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 49వ ఓవర్లకు కుదించగా.. జెమీమా, రీచా ఘోష్(4 నాటౌట్) చెరొక బౌండరీ కొట్టడంతో.. టీమిండియా ప్రత్యర్థికి 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
సెమీస్ బెర్తును నిర్ణయించే మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఓపెనర్లు స్మృతి మంధాన(109).. ప్రతీకా రావల్(122)లు న్యూజిలాండ్ బౌలర్లను ఉతికేశారు. పవర్ ప్లేలోనే రన్స్ పిండుకున్న ఈ ద్వయం ఆ తర్వాత మరిం జోరు పెంచింది. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలతో చెలరేగి.. శతకాలు సాధించారు. సెంచరీ తర్వాత సుజీ బేట్స్ ఓవర్లో సిక్సర్‌కు యత్నించిన మంధాన బౌండరీ వద్ద దొరికిపోయింది. దాంతో.. 212 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
Innings Break!
1️⃣2️⃣2️⃣ for Pratika Rawal
1️⃣0️⃣9️⃣ for Smriti Mandhana
7️⃣6️⃣* for Jemimah RodriguesA solid batting show from #TeamIndia to post a target of 3️⃣4️⃣1️⃣ (DLS method) 🎯
Over to our bowlers now!
Scorecard ▶ https://t.co/AuCzj0X11B#WomenInBlue | #CWC25 | #INDvNZ pic.twitter.com/4taRQ1aXxT
— BCCI Women (@BCCIWomen) October 23, 2025
అనంతరం.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (74 నాటౌట్)సైతం దూకుడుగా ఆడింది. కాసేపటికే ప్రతీక మెగా టోర్నీలో మొదటి శతకం బాదేసింది. 108 పరుగుల వద్ద ప్రతీక ఇచ్చిన తేలికైన క్యాచ్ వదిలేసింది. కానీ, కాసేపటికే అమేలియా కేర్ ఓవర్లో వరుసగా రెండో సిక్సర్ కొట్టబోయిన ప్రతీక ఔటయ్యింది. అప్పటికి టీమిండియా స్కోర్.. 288. ఓపెనర్లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరినా.. జెమీమా బౌండరీలతో విరుచుకుపడింది. కట్, స్వీప్.. ఆటాకింగ్ షాట్లతో ఫోర్లు బాదుతూ వన్డేల్లో 8వ అర్ధ శతకం పూర్తి చేసుకుంది.
An 𝙤𝙥𝙚𝙣𝙞𝙣𝙜 𝙖𝙘𝙩 for the record books 📚🔝
Vice-captain Smriti Mandhana and Pratika Rawal become the first #TeamIndia pair to compile a 2️⃣0️⃣0️⃣-plus stand in ICC Women’s Cricket World Cups! 🤝#WomenInBlue | #CWC25 | #INDvNZ pic.twitter.com/42vUvaJahi
— BCCI Women (@BCCIWomen) October 23, 2025
కార్సన్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన జెమీమా జోరుకు వర్షం అంతరాయం కలిగించింది. ఆట నిలిచే సమయానికి .. 329-2తో ఉన్న టీమిండియా.. 49 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (10) వికెట్ కోల్పోయింది. అయితే.. జెమీమా, రీచా ఘోష్ (4 నాటౌట్)లు చెరొక ఫోర్ బాదగా కివీస్‌కు 341 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్.