INDW vs RSAW : ఫార్మాట్ ఏదైనా బౌలర్లపై విరుచుకుపడే భారత(Team India) ఓపెనర్ స్మృతి మంధాన(117) దక్షిణాఫ్రికా (South Africa)పై శతక్కొట్టింది. విధ్వంసక ఇన్నింగ్స్‌తో మెరుపు సెంచరీ బాదింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో 53 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో మంధాన ఒంటరిగా పోరాడింది. ఆఖర్లో ఆల్‌రౌండర్లు దీప్తి శర్మ(37) పూజా వస్త్రాకర్(31 నాటౌట్) ధనాధన్ ఆడారు. దాంతో భారత జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 రన్స్ చేసింది.
టాస్ గెలిచిన భారత మహిళల జట్టుకు సఫారీ పేసర్ మసబత క్లాస్ ఆదిలోనే షాకిచ్చింది. డేంజరస్ ఓపెనర్ షెఫాలీ వర్మ(7) ను ఔట్ చేసి పర్యాటకు జట్టుకు బ్రేకిచ్చింది. ఆ కాసేపటికే దయలాన్ హేమలత(12), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(10)లు డగౌట్‌కు చేరారు. 53 పరుగులకే మూడు వికెట్లు పడడంతో 150 లోపే టీమిండియా ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ, మంధాన పట్టు విడువలేదు. దీప్తి శర్మతో కలిసి కీలక భాగస్వాయ్యం నిర్మించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది.
Smriti Mandhana sparkles with her sixth ODI century as India make 265/8 in Bengaluru #INDvSA
👉 https://t.co/4rlRlxv6tZ pic.twitter.com/YYqsHXgBCp
— ESPNcricinfo (@ESPNcricinfo) June 16, 2024
అర్ధ శతకం తర్వాత మరింత దూకుడుగా ఆడిన ఈ సొగసరి బ్యాటర్ ఏకంగా సెంచరీ కొట్టేసింది. 127 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 117 పరుగుల చేసిన మంధాన మసబత ఓవర్లో వెనుదిరిగింది. ఆమె ఔటయ్యాక పూజ వస్త్రాకర్(31 నాటౌట్) దంచి కొట్టింది. దాంతో, హర్మన్‌ప్రీత్ సేన సఫారీలకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.