Smriti Mandhana | కెప్టెన్సీకి నేను సిద్ధమే.. లార్డ్స్ విజయం మరుపురానిది..!
Smriti Mandhana : లార్డ్స్‌లో జరిగిన ఏకైక టెస్టులో భారత జట్టు చరిత్రాత్మక విజయంలో భాగమైన స్మృతి మంధాన (Smriti Mandhana) రాబోయే రోజుల్లో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.
Smriti Mandhana : లార్డ్స్‌లో జరిగిన ఏకైక టెస్టులో భారత జట్టు చరిత్రాత్మక విజయంలో భాగమైన స్మృతి మంధాన (Smriti Mandhana) రాబోయే రోజుల్లో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న మంధాన టీమిండియ సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. లార్డ్స్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధ శతకాలతో మెరిసిన ఈ ఓపెనర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘హర్మన్‌ప్రీత్ కౌర్ గైర్హాజరీలో మీరు సారథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నారా?’ అనే ప్రశ్నకు ‘నేను రెఢీ’ అని బదులిచ్చింది.
భారత మహిళల జట్టు విజయాల్లో కీలకమవుతున్న స్మృతి మంధాన లార్డ్స్ టెస్టుతో మరోసారి తానెంత విలువైన క్రికెటరో చాటింది. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికిస్తూ రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధ శతకాల(83, 70)తో రెచ్చిపోయిన మంధాన.. వైస్ కెప్టెన్‌గా తన బాధ్యతను సమర్ధంగా పోషించింది. ఇదే ఉత్సాహంతో అవకాశం రావాలేగానే కెప్టెన్‌గా రాణిస్తానని అంటోందీ ఓపెనర్.
టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో లార్డ్స్ టెస్టు విజయంపై మాట్లాడిన మంధాన.. ‘హర్మన్‌ప్రీత్ కౌర్ గైర్హాజరీలో జట్టును నడిపించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?’ అనే ప్రశ్నకు ‘అవును.. నేను రెఢీ’ అని చెప్పింది. ‘ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన మహిళల ఏకైక టెస్టు ఆడడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మ్యాచ్ గెలుపొందండం ఇంకా ఆనందంగా ఉంది. చరిత్రాత్మక మ్యాచ్‌లో భారత జట్టు విజయంలో భాగమవ్వడం నాకు చాలా ప్రత్యేకం.
🚨 Amid the possibility of India’s captaincy transition, Smriti Mandhana says she’s “ready” to lead!#CricketTwitter pic.twitter.com/wlQlFuxXFr
— Female Cricket (@imfemalecricket) July 15, 2026
మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు టెస్టు క్రికెట్ ఆడాలని కలలు కన్నాం. లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ ఆడడం మరపురానిది’ అని మంధాన తెలిపింది. పదేళ్లకు పైగా టీమిండియాలో కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్న మంధాన.. త్వరలోనే కెప్టెన్‌గా ప్రమోట్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకుంటే ప్రస్తుత సారథి హర్మన్‌ప్రీత్ వయసు 37 ఏళ్లు దాటింది. మంధానకు 29 ఏళ్లు మాత్రమే.

నిరుడు స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ట్రోఫీని అందించిన హర్మన్‌ప్రీత్ చిరకాల నిరీక్షణకు తెరదించింది. లార్డ్స్ టెస్టులో చిరస్మరణీయ విజయంతో ఆమె కీర్తి మరింత పెరిగింది. అయితే.. వచ్చే టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ నాటికి హర్మన్‌ప్రీత్ మూడు ఫార్మాట్లలో కొనసాగకపోవచ్చు.. అదే జరిగితే వైస్ కెప్టెన్సీ అనుభవమున్న మంధానకు బాధ్యతలు అప్పగించడం లాంఛనమే. ఇప్పటివరకూ 18 టీ20లు, నాలుగు వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన మంధాన.. 15 విజయాలు సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

