INDW vs AUSW : స్వదేశంలో జరుగబోయే వరల్డ్ కప్ ముందు భారత జట్టు వన్డే సిరీస్ కోల్పోయింది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన (125) విధ్వంసక సెంచరీతో చెరేగినా ఆస్ట్రేలియా బౌలర్ల విజృంభణతో టీమిండియా ఓడిపోయింది. 43 పరుగుల తేడాతో గెలుపొందిన ఆసీస్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
వరల్డ్ కప్ సన్నద్ధతలో ఉన్న భారత జట్టుకు ఆస్ట్రేలియా షాకిచ్చింది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో భారీ స్కోర్ చేసిన ఆసీస్.. బౌలింగ్‌లోనూ రాణించి టీమిండియాకు చెక్ పెట్టింది. కొండంత ఛేదనలో ఓపెనర్ స్మృతి మంధాన(125), దీప్తి శర్మ(72)లు చెలరేగి ఆడినా వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కంగారూ జట్టు సిరీస్‌ను 2-1తో తన్నుకుపోయింది.
Absolutely EPIC 🙌 #INDvAUS scorecard⏩ https://t.co/EoovVU5X5Z pic.twitter.com/eewtHc3gr6
— ESPNcricinfo (@ESPNcricinfo) September 20, 2025
ఆస్ట్రేలియా నిర్దేశించిన భారీ ఛేదనను భారత్ దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్ ప్రతీకా రావల్ (10) తొలి ఓవర్లో రెండు ఫోర్లతో చెలరేగింది. ఆ తర్వాత స్మృతి మంధాన(125) తన మార్క్ షాట్లతో అలరిస్తూ స్కోర్ బోర్డును ఉరికించింది. మేగన్ షట్ వేసిన మూడో ఓవర్లలో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన మంధాన ప్రత్యర్ధిని కంగారెత్తించింది. అనంతరం కిమ్ గార్త్ బౌలింగ్‌లో ప్రతీకా వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్(11)తో మంధాన కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ.. టీమిండియాకు రెండో షాకిస్తూ డియోల్‌ను వెనక్కి పంపింది మేగన్.
India post their HIGHEST-EVER ODI total and yet, it isn’t enough 😵
Australia take the series 2-1 👑 #INDvAUS scorecard⏩ https://t.co/EoovVU5X5Z pic.twitter.com/RjbgwUkfmM
— ESPNcricinfo (@ESPNcricinfo) September 20, 2025
స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడిన వేళ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (52), మంధాన కీలక భాగస్వామ్యం నిర్మించారు. దాంతో.. 10 ఓవర్లకు టీమిండియా 96/2తో పోటీలో ఉంది. అయితే.. వరుస ఓవర్లలో కౌర్, మంధాన, రీచా ఘోష్ ఔట్ కావడంతో స్కోర్ వేగం తగ్గింది. కీలక వికెట్లు పడినా దీప్తి శర్మ(72), రాధా యాదవ్(18)లు ఇన్నింగ్స్ నిర్మించారు. రాధ ఔటయ్యాక.. స్నేహ్ రానా(35)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 65 పరుగులు జోడించింది దీప్తి. అయితే.. మెక్‌గ్రాత్ ఓవర్లో పెద్ద షాట్ ఆడిన దీప్తి వెనుదిరిగింది. ఆతర్వాత టెయిలెండర్లతో రానా పోరాడినా ఫలితం లేకపోయింది. రేణుకా సింగ్ పదో వికెట్‌గా వెనుదిరగడంతో కంగారూ టీమ్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది.
స్మృతి మంధాన – 50 బంతుల్లో, ఆస్ట్రేలియపై, 2025లో.
విరాట్ కోహ్లీ – 52 బంతుల్లో, ఆస్ట్రేలియాపై, 2013లో.
వీరేంద్ర సెహ్వాగ్ – 60 బంతుల్లో, న్యూజిలాండ్‌పై, 2009లో.
మొహ్మమద్ అజారుద్దీన్ – 62 బంతుల్లో, న్యూజిలాండ్‌పై, 1988లో.
కేల్ రాహుల్ – 62 బంతుల్లో, నెదర్లాండ్స్‌పై, 2023లో.
మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కొండంత స్కోర్ చేసింది. భారత బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ జార్జియా వొల్(81), ఎలీసా పెర్రీ(68) హాఫ్ సెంచరీతో మెరవగా.. బేత్ మూనీ(138) విధ్వసంక శతకంతో రెచ్చిపోయింది. ఆమె జోరు చూస్తే.. ఆసీస్ జట్టు సులువగా 430 ప్లస్ కొట్టేలా కనిపించింది. కానీ, చివర్లో అరుంధతి రెడ్డి (3-86), దీప్తి శర్మ(2-72)లు కట్టడి చేయడంతో 412 పరుగులతో ఆగిపోయింది. వన్డే చరిత్రలో భారత జట్టుపై అత్యధిక స్కోర్ నమోదు చేసింది.