Batminton with Broom : బ్యాడ్మింటన్ అనగానే ఎవరికైనా పుల్లెల గోపీచంద్, పీవీ సింధు(PV Sindhu), సైనా నెహ్వాల్ పేర్లు గుర్తుకొస్తాయి. వాళ్లు రాకెట్‌తో సాధించిన అద్భుత విజయాలు మదిలో మెదులుతాయి. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని షటిల్, కాక్ అందుకున్నవాళ్లు చాలామందే. అయితే.. తాజాగా ఓ వ్యక్తి మాత్రం రాకెట్(Racquet) లేకుండానే చీపురు (Broom) కట్టతో అలవోకగా బ్యాడ్మింటన్ ఆడేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
గత వారం జతిన్ శర్మ అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టాడు. అందులో ఇద్దరు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. అంతలోనే ఒక వ్యక్తి చీపురుతో కోర్టులోకి వచ్చాడు. ప్లాస్టిక్ చీపురు కట్టతో అతడు అవలీలగా బ్యాడ్మింటన్ ఆడాడు. షటిల్ బ్యాటుతో ఆడినట్టే ఎంతో నేర్పుగా కాక్‌ను అవతలి కోర్డులోకి పంపాడు. దాంతో, అవతలి ఎండ్‌లో ఉన్న మహిళ సైతం అతడి నైపుణ్యానికి ఆశ్చర్యపోయింది.
ఆ వీడియో చూసిన వాళ్లంతా వాట్ ఏ టాలెంట్ అంటూ ఫిదా అవుతున్నారు. మరికొందరేమో తాము రాకెట్ కొని డబ్బులు వృథా చేశామని, కవర్ పేజీ చూసి పుస్తకంపై అంచనాకు రావొద్దంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటికే 30 లక్షల మందికిపైగా చూశారు. దాదాపు రెండు లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి.