Actor Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. గతంలో మిగ్జాం తుపాను సమయంలో సూర్య ఫ్యాన్స్ వేలమంది బాధితులకు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వారికి సూర్య విందును ఏర్పాటు చేశారు.
గత ఏడాది మిగ్జాం తుపాను కారణంగా తమిళనాడు అల్లకల్లోలం అయిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని చెన్నై తదితర ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. దీంతో ప్రజల జీవనోపాధిపై ప్రభావం పడింది. వరద నీటిలో ఎంతో మంది పేద ప్రజల గృహాలు కొట్టుకుపోయాయి, ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. వేలాది మంది అన్నం, నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు.
అయితే ఈ వరదల్లో నష్టపోయిన ప్రజలకు సూర్య, కార్తీలు వెంటనే రూ. 10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక ఈ వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా ఉండాలని సూర్య తన ఫ్యాన్స్ కు పిలుపునిచ్చాడు. దీంతో మరో ఆలోచన లేకుండా ఫ్యాన్స్ అందరూ వచ్చి సాయం చేశారు. అయితే అభిమానుల సేవలు గుర్తించిన సూర్య.. వారందరీని ఒక్కసారి కలుసుకోవాలని విందు ఏర్పాటు చేశారు. ఇక ఈ విందులో తన అభిమానులకు స్వయంగా సూర్యనే వడ్డించడం విశేషం. అలాగే గత రెండేళ్లలో పెళ్లి చేసుకున్న దాదాపు 50 మంది అభిమానులను కలుసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Actor @Suriya_offl met and appreciated his fans who worked in relief efforts in Tirunelveli and Tuticorin districts during the recent cyclone..
Also met and wished about 50 of his fans who got married in the last couple of years..
A sumptuous lunch was arranged for his fans..… pic.twitter.com/RCXzcVoZpA
— Ramesh Bala (@rameshlaus) March 3, 2024