వాషింగ్టన్: అమెరికాలో వలసదారులపై మరో దారుణం చోటుచేసుకుంది. మినియాపోలిస్‌లో బుధవారం ఇమిగ్రేషన్ ఏజెంట్ ఒకరు 37 ఏండ్ల మహిళను కాల్చి చంపారు. రెనీ నికోలో గుడ్ అనే మహిళ కారులో వస్తుండగా, ఆమె ఇంటికి సమీపంలో అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఏజెంట్ ఒకరు ఆమెను కాల్చి చంపారు.
బుధవారం మినియాపాలిస్‌లో అధికారులు ఇమిగ్రేషన్ ఆపరేషన్‌ను నిర్వహించారు. దీనికి వ్యతిరేకంగా నిరసనకారులు ఉద్యమానికి దిగారు. ఈ క్రమంలో కారులో కూర్చున్న నికోలోపై అధికారులు కాల్పులు జరిపారు. వలస దారులపై ట్రంప్ నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్‌లో గ్రాడ్యుయేట్ అయిన రెనీ కవయిత్రి కూడా.