యువ నటుడు హవీష్ హీరోగా అగ్ర దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’. కావ్య థాపర్ కథానాయిక. హర్నిక్స్ ఇండియా ఎల్ఎల్పి పతాకంపై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా టీజర్‌ను నేటి నుంచి ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా ప్రదర్శింపబడుతున్న అన్ని థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్టు మేకర్స్ గురువారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
పానిండియా సూపర్‌స్టార్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమాతోపాటు తమ సినిమా టీజర్ విడుదల కావడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేశారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా త్వరలోనే టీజర్‌ని విడుదల చేస్తామని ప్రకటనలో మేకర్స్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో హీరో హవీష్ ఇంటెన్స్ అవతారంలో ఫెరోషియస్‌గా కనిపిస్తున్నారు. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిశోర్, మురళీశర్మ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: మిక్కీ జె.మేయర్.