IPL 2024 Mini Auction | ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన మల్లికా సాగర్.. ఇంతకీ ఎవరు ఈమె ?
IPL 2024 Mini Auction : ఇండియన్ ప్రీమియర్ 17వ సీజన్ మినీ వేలం దుబాయ్(Dubai) గడ్డపై మరికాసేపట్లో షురూ కానుంది. 10 ఫ్రాంచైజీలతో పాటు కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈ వేలం పాటను తొలిసారి ఒక మహిళ నిర్వహించనుంది. ఆమె ఎవరో కాదు.. ఫేమస్ ఆక్షనీర్ మల్లికా సాగర్...
IPL 2024 Mini Auction : ఇండియన్ ప్రీమియర్ 17వ సీజన్ మినీ వేలం దుబాయ్(Dubai) వేదికగా జరుగుతోంది . 10 ఫ్రాంచైజీలతో పాటు కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈ వేలం పాటను తొలిసారి ఒక మహిళ నిర్వహించనుంది. ఆమె ఎవరో కాదు.. ఫేమస్ ఆక్షనీర్ మల్లికా సాగర్ (Mallika Sagar). ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ మగవాళ్లు మాత్రమే ఆక్షనీర్‌గా ఉన్నారు.
మొదట్లో రిచర్డ్ మడ్లే, హుగ్ ఎడ్మెడెస్(బ్రిటన్), చారు శర్మ(భారత్) తర్వాత ఈ లీగ్ వేలాన్ని నిర్వహిస్తున్న నాలుగో ఆక్షనీర్‌గా, తొలి మహిళగా మల్లికా రికార్డుల్లోకి ఎక్కింది. ఐపీఎల్ బీసీసీఐ తొలిసారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ వేలంతో మల్లికా పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆక్షన్ సమయంలో ఏమాత్రం తడబడకుండా స్పష్టంగా మాట్లాడడం ఆమె ప్రత్యేకత. అంతేకాదు ఎంతో నేర్పుగా, ఓర్పుగా ఉండడం 48 ఏండ్ల మల్లిక విజయ రహస్యం.
ఆక్షనీర్ మల్లికా సాగర్

వ్యాపార నేపథ్య కుటుంబం
ముంబైలోని వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన మల్లికకు ఆర్ట్ కలెక్షన్ అంటే ఇష్టం. దాంతో, అమెరికాలో హిస్టరీ ఆఫ్ ఆర్ట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అనంతరం.. స్వదేశం తిరిగొచ్చిన మల్లిక ముంబైలోని ఒక ప్రైవేట్ ఆక్షన్ సంస్థలో ఆధునిక భారత దేశానికి సంబంధించిన కళాకండాలను వేలం వేసింది. 2011లో మల్లిక ఇంటర్నేషనల్ ఆర్ట్, లగ్జరీ బిజినెస్ క్రిస్టీలో ఆక్షనీర్‌గా వ్యవహరించింది.

దాంతో, భారత క్రీడా రంగంలో ఏకైక మహిళా ఆక్షనీర్‌గా పేరొందిన ఆమె నాలుగు సార్లు ఐపీఎల్ ఆక్షనీర్‌గా ఉన్న ఎడ్మెడెస్ దృష్టిలో పడింది. దాంతో, ఆయన బీసీసీఐకి మల్లిక పేరు సూచించారు. అలా మల్లిక మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ చాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ప్రో కబడ్డీ 10వ సీజన్ వేలానికి కూడా మల్లికనే ఆక్షనీర్‌గా పిలిచారు. ఈమధ్యే ముగిసిన డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ వేలంలోనూ మల్లిక తన మార్క్ చూపించింది.
ఇవి కూడా చదవండి
- Praja Vani | ప్రజా భవన్లో ప్రజావాణి.. భారీగా ట్రాఫిక్ జామ్
- Mouni Roy | తండి అందాలతో సెగలు పుట్టిస్తున్న మౌనీరాయ్..
- Sangareddy | సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
- ENG vs WI | ఇంగ్లండ్‌తో మూడో టీ20 .. విండీస్ చిచ్చరపిడుగుపై వేటు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

