ENG vs WI | ఇంగ్లండ్‌తో మూడో టీ20 .. విండీస్ చిచ్చరపిడుగుపై వేటు
ENG vs WI : సొంత గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్(England)ను చిత్తు చేసిన వెస్టిండీస్(West Indies) పొట్టి సిరీస్‌పై కన్నేసింది. ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉన్న పావెల్ సేన.. మంగళవారం ట్రినిడాడ్‌లో జరిగే నాలుగో టీ20లో గెలుపే లక్ష్యంగా బరిలోకి...
ENG vs WI : సొంత గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్(England)ను చిత్తు చేసిన వెస్టిండీస్(West Indies) పొట్టి సిరీస్‌పై కన్నేసింది. ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉన్న పావెల్ సేన.. మంగళవారం ట్రినిడాడ్‌లో జరిగే నాలుగో టీ20లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. దాంతో, ఆఖరి రెండు టీ20ల కోసం వెస్టిండీస్ సెలెక్టర్లు ఆఖరి రెండు టీ20లకు స్క్వాడ్‌ను ప్రకటించారు.
వరుసగా రెండు మ్యాచుల్లో విఫలమైన చిచ్చరపిడుగు షిమ్రాన్ హెట్‌మైర్(Shimron Hetmyer)పై వేటు వేశారు. స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్(Aalzarri Joseph)కు విశ్రాంతినిచ్చారు. హెట్‌మైర్ స్థానంలో డాషింగ్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్(Jhonson Charles)ను తీసుకున్నారు.
విండీస్ స్క్వాడ్ : రొవ్మన్ పావెల్(కెప్టెన్), షాయ్ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫోర్డే, జేసన్ హోల్డర్, అకీల్ హొసేన్, బ్రాండన్ కింగ్, కైలీ మేయర్స్, గుడకేశ్ మోతీ, నికోలస్ పూరన్, ఆండ్రూ రస్సెల్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్.
వన్డేల్లో సిరీస్‌లోనూ హెట్‌మైర్ 32, 0, 12 పరుగులకే వెనుదిరిగాడు. పొట్టి క్రికెట్లో మెరుగైన రికార్డు ఉన్నందున టీ20లకు ఎంపిక చేశారు. కానీ, ఈ స్టార్ బ్యాటర్ వరుసగా రెండు టీ20ల్లో 1, 2 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో సెలెక్టర్లు అతడిని పక్కనపెట్టేశారు. మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో మూడు ఫార్మాట్ల సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని జోసెఫ్‌కు విశ్రాంతినిచ్చారు.
ఫిలిఫ్ సాల్ట్ (109 నాటౌట్), హ్యారీ బ్రూక్ (30 నాటౌట్)

రెండో టీ20లో విండీస్ నిర్దేశించిన 223 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ ఆటగాడు ఫిలిఫ్ సాల్ట్(109 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. అయితే ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికే ఒక వికెట్ తీసిన ఆండ్రూ రస్సెల్ బంతి అందుకున్నాడు. దాంతో, ఇప్పటివరకూ పెద్దగా రాణించని హ్యారీ బ్రూక్(Harry Brook) వీరకొట్టుడు కొట్టాడు. తొలి బంతికి ఫోర్ బాదిన బ్రూక్.. ఆ తర్వాత బాల్‌ను లెగ్‌సైడ్‌లో స్టాండ్స్‌లోకి పంపాడు. ఇక మూడో బంతిని ఫైన్ లెగ్ దిశగా సిక్సర్‌గా మలిచాడు. ఐదో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా స్టాండ్స్‌లోకి పంపడంతో ఇంగ్లండ్ డగౌట్లో సంబురాలు మొదలయ్యాయి. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో డిసెంబర్ 21వ తేదీన ఐదో టీ20 జరుగనుంది.
ఇవి కూడా చదవండి
- Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో ముస్లింల పిటీషన్లు కొట్టివేత
- Kriti Sanon | కవ్వించే చూపులతో కైపెక్కిస్తున్న కృతి సనన్..
- KTR: తెలంగాణ భవిష్యత్తు ఇలాగే ఉండబోతుందా?: కేటీఆర్
- CM Revanth Reddy | ఢిల్లీకి సీఎం రేవంత్.. ఎమ్మెల్సీ ఎన్నికలు, కేబినెట్ విస్తరణపై అధిష్ఠానంతో చర్చ!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

