KTR: తెలంగాణ భవిష్యత్తు ఇలాగే ఉండబోతుందా?: కేటీఆర్
KTR: డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది.. ప్రచారంలో వాగ్ధానం చేసింది నిజమే.. కానీ అన్ని వాగ్దానాలను అమలు చేయలేమని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో అన్నారు. ఆ వీడియోను కేటీఆర్ ఇవాళ రీట్వీట్ చేశారు. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉండబోతుందా అని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో చెప్పినంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో పేర్కొన్న వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ రీట్వీట్ చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు డబ్బులు లేవని కర్నాటక సీఎం అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పారు. ఆ ప్రసంగానికి చెందిన వీడియోను ఉత్తరాంధ్ర నౌ అనే సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేశారు. ఆ పోస్టును ఎమ్మెల్యే కేటీఆర్ రీట్వీట్ చేస్తూ కొన్ని ప్రశలు లేవనెత్తారు.
ఎన్నికల వాగ్ధానాలను, గ్యారెంటీలను నెరవేర్చేందుకు డబ్బు లేదని కర్నాటక సీఎం అంటున్నారని కేటీఆర్ తన ఎక్స్ పోస్టులో విమర్శించారు. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉండబోతుందా అని కూడా ఆయన ప్రశ్నించారు. కపట వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్లు ఆయన ఆరోపించారు.
ఏమాత్రం పరిశోధన చేయకుండా మోసపూరిత వాగ్దానాలను ఎలా ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఎటువంటి ప్లానింగ్ లేకుండానే విపరీతమైన ప్రకటనలు ఎలా చేస్తారని ఆయన తన ఎక్స్ పోస్టులో నిలదీశారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని, ఎన్నికల్లో వాగ్దానం చేసింది కరెక్టే అని, కానీ అన్ని వాగ్ధానాలను పూర్తి చేయలేమని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో తెలిపారు.
No money to deliver poll promises/guarantees says Karnataka CM !
Is this the future template for Telangana too after successfully hoodwinking the people in elections ?
Aren’t you supposed to do basic research and planning before making outlandish statements? https://t.co/JOcc4NLsiq
— KTR (@KTRBRS) December 19, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

