South Africa Squad : ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా(South Africa) మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. ఆసీస్‌ను వాళ్ల సొంతగడ్డపై మట్టికరిపించిన సఫారీ సైన్యం ఈసారి ఇంగ్లండ్‌ను ఢీకొననుంది. సెప్టెంబర్‌లో అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది ప్రొటీస్ టీమ్. దాంతో.. సెలెక్టర్లు రెండు ఫార్మాట్లకు పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. వన్డేలకు తెంబ బవుమా, పొట్టి జట్టుకు ఎడెన్ మర్క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
నిరుడు పొట్టి ప్రపంచ కప్ తర్వాత టీ20లకు దూరమైన పలువురిని స్క్వాడ్‌లోకి తీసుకున్నారు సెలెక్టర్లు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన కేశవ్ మహరాజ్ పొట్టి స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. డేంజరస్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ సైతం టీ20 సిరీస్ బృందంలో చోటు దక్కించుకున్నాడు.
Keshav Maharaj has been recalled to South Africa’s T20 squad for their tour of England; Marco Jansen and Lizaad Williams also return after being sidelined due to injuries pic.twitter.com/nhPjUJuiX6
— ESPNcricinfo (@ESPNcricinfo) August 23, 2025
ఇంగ్లండ్ పర్యటనకు సెలెక్టర్లు ప్రకటించిన పరిమిత ఓవర్ల స్క్వాడ్‌ను మహారాజ్‌తో పాటు యువకెరటం క్వెనా మఫాకా, డెవాల్డ్ బ్రెవిస్‌లు ఉన్నారు. పేసర్లు లిజాడ్ విలియమ్స్, మార్కో యాన్సెన్‌లు కూడా మళ్లీ పొట్టి ఫార్మాట్‌కు ఆడేందుకు రెఢీ అవుతున్నారు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య సెప్టెంబర్ 2న తొలి మ్యాచ్‌తో వన్డే సిరీస్ షురూ కానుంది. అనంతరం సెప్టెంబర్ 10న జరిగే టీ20తో పొట్టి సిరీస్ మొదలవ్వనుంది.
దక్షిణాఫ్రికా వన్డే స్క్వాడ్ : ఎడెన్ మర్క్రమ్, రియాన్ రికెల్టన్, తెంబా బవుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్, టోనీడి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, లాన్డ్రె ప్రిటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్, వియాన్ మల్డర్, కార్బిన్ బాస్చ్, నంద్రె బర్గర్, లుంగి ఎంగిడి, కగిసో రబడ, క్వెనా మఫాకా, సెనురన్ ముతుస్వామి, కేశవ్ మహరాజ్.
దక్షిణాఫ్రికా టీ20 స్క్వాడ్ : ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, లాన్డ్రె ప్రిటోరియస్, డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్, డోనొవాన్ ఫెరేరీ, మర్కో యాన్సెస్, కార్బిన్ బాస్చ్, లుంగి ఎంగిడి, కగిసో రబడ, క్వెనా మఫాకా, సెనురన్ ముతుస్వామి, కేశవ్ మహరాజ్. లిజాడ్ విలియమ్స్.