Magnus Carlsen : చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen) తండ్రి కాబోతున్నాడు. కార్ల్సన్ భార్య ఎల్లా విక్టోరియా మలొనే (Ella Victoria Malone) త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనిన్వనుంది. ఈ విషయాన్ని కార్ల్సన్ బుధవారం అభిమానులతో పంచుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా అతడు బేబీ బంప్‌తో ఉన్న తన భార్య ఫొటోలను పోస్ట్ చేశాడు.
‘గర్భవతి అయిన నా అందమైన భార్య’ అంటూ ఆ ఫొటోలకు క్యాష్షన్ రాశాడు కార్ల్సన్. ఈ పోస్ట్ చూసిన చెస్ క్రీడాకారులు, అభిమానులు కార్ల్సన్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటున్నామని కార్ల్సన్ భార్య ఎల్లా చెబుతోంది.
‘మా ఆయన చెస్ షెడ్యూల్‌తో బిజీగా ఉండవచ్చు. మేము ఇటు పిల్లలను, అటు వృత్తిని ఎలా సమన్వయం చేసుకుంటామో నాకు తెలియడం లేదు. అయితే.. సంతానం కలగాలని మేమిద్దరం కోరుకుంటున్నాం. కార్ల్సన్ చదరంగం ఆటతో తీరిక లేకుండా ఉండచవ్చు. కానీ, అతడు గొప్ప తండ్రి అవుతాడనే నమ్మకం నాకుంది’ అని ఎల్లా వెల్లడించింది. కొన్నాళ్లుగా ప్రేమించుకున్న కార్ల్సన్, ఎల్లా ఈ ఏడాది జనవరి 4వ తేదీన పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం కార్ల్సన్ ఆన్లైన్ చెస్ పోటీలకు సిద్ధమవుతున్నాడు. మే 18 నుంచి 23 వరకూ జరుగబోయే చెస్.కామ్ క్లాసిక్ (Chess.Com Classic)లో అతడు బరిలోకి దిగున్నాడు. ఆ తర్వాత స్వదేశం తరఫున కీలకమైన టోర్నీలో ఆడనున్నాడు కార్ల్సన్. మే 26 నుంచి జూన్ 6 వరకూ నార్వే చెస్ టోర్నమెంట్ (Norway Chess Tournament)లో పాల్గొననున్నాడు. సమకాలీన ఆటగాళ్లలో లెజెండ్ అనిపించుకుంటున్న కార్ల్సన్ ఇప్పటివరకూ పలు ఫార్మాట్లలో 17 వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిళ్లు సాధించాడు.