ODI World Cup 2023 : సొంత గడ్డపై జరిగిన ఆసియా కప్(Asia Cup 2023) ఫైనల్లో టీమిండియా చేతిలో చావు దెబ్బ తిన్న మాజీ చాంపియన్ శ్రీలంక(Srilanka) జట్టుకు శుభవార్త. ఎడమ చేతి పేసర్లు దిల్షాన్ మదుషనక(Dilshan Madushanka), లహిరు కమార(Lahiru Kumara) ఫిట్నెస్ సాధించారు. దాంతో, సెలెక్టర్లు వీళ్లిద్దరినీ ప్రపంచ కప్ స్క్వాడ్‌లోకి తీసుకున్నారు.
యువ స్పిన్నర్ మహీశ్ థీక్షణ(Maheesh Theekshana) కూడా 15 మంది బృందంలో ఉండే అవకాశం ఉంది. మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) గైర్హాజరీలో యువ సంచలనం దునిత్ వెల్లలాగే, థీక్షణ లంక స్పిన్ భారాన్ని మోయనున్నారు.
Presenting our powerhouse squad for the ICC Men’s Cricket World Cup 2023.
Let’s rally behind the #LankanLions 🦁👊#CWC23 pic.twitter.com/NTD4A8YbkZ
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 26, 2023
తొడ కండరాల గాయం(Harmstring Injury)తో బాధపడుతున్న హసరంగ వరల్డ్ కప్ టోర్నీలో ఆడకపోవచ్చు. నెల క్రితం స్వదేశంలో జరిగిన లంక ప్రీమియర్ లీగ్(Lanka Premiere League)లో గాయపడిన అతను ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ‘హసరంగ ఆరోగ్యం ఇంకా మెరుగవ్వలేదు. అతడిని విదేశీ డాక్టర్లకు చూపిస్తున్నాం. ఒకవేళ సర్జరీ చేయాల్సి వస్తే ఈ స్టార్ స్పిన్నర్ మూడు నెలల పాటు ఆటకు దూరం అవుతాడు’ అని ఆ దేశ క్రికెట్ బోర్డు చీఫ్ డాక్టర్ అర్జున డిసిల్వా(Arjuna de Silva) వెల్లడించాడు.
వనిందు హసరంగ
జింబాబ్వే వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(ODI World Cup Qualifiers 2023)లో హసరంగా చెలరేగాడు. వరుసగా 5 వికెట్ల ప్రదర్శనతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు. అతడి స్పిన్ మాయతో లంక వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించింది. ప్రధాన ఆయుధం అయిన అతను మెగా టోర్నీకి దూరం కావడం లంకకు పెద్ద లోటే.
శ్రీలంక వరల్డ్ కప్ స్క్వాడ్ : దసున్ షనక(కెప్టెన్), కుశాల్ మెండిస్(వైస్ కెప్టెన్), పథుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, సధీర సమరవిక్రమ, చరిత అసలంక, ధనంజయ డిసిల్వా, మథీశ థీక్షణ, దుషాన్ హేమంత, దునిత్ వెల్లలాగే, కసున్ రజిత, మథీశ పథిరణ, లహిరు కుమార, దిల్షాన్ మదుషనక.