NZ vs BAN : న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో బంగ్లాదేశ్(Bangladesh) బ్యాటర్లు చేతులెత్తేశారు. కివీస్ పేసర్ ఆడం మిల్నే(Adam Milne) 4 వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. దాంతో, బంగ్లా 34.3 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది. షొరిఫుల్ ఇస్లాం(Shoriful Islam)ను మిల్నే ఔట్ చేయడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(Najmal Hussain Shanto) 70 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. అయితే.. ఆ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 6 పరుగుల వద్ద ఓపెనర్ జకీర్ హసన్ (1)ను మిల్నే బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బౌల్ట్ కూడా విజృంభించడంతో మరో ఓపెనర్ తంజిద్ హసన్(5) కూడా వెనుదిరిగాడు.
172 the target to win the series 🎯
Adam Milne (4-34) with career-best ODI figures leading the bowling attack alongside Trent Boult (2-33) and Cole McConchie (2-18)
Watch play LIVE in NZ https://t.co/scL2cXy9jz 📺 LIVE scoring https://t.co/0B5OY12oc1 📲 pic.twitter.com/UwPf4HmJzm
— BLACKCAPS (@BLACKCAPS) September 26, 2023
ఆదుకుంటాడనుకున్న సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీం(18)ను ఫెర్గూసన్ పెవిలియన్ పంపాడు. ఒకవైపు వచ్చినవాళ్లు వచ్చినట్టే ఔట్ అవుతుంటే.. కెప్టెన్ శాంటో మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. అతడు జట్టు స్కోర్ 168 చేరగానే ఔటయ్యాడు. అక్కడితో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు.