శనివారం 29 ఫిబ్రవరి 2020
ఎంగ్డీ మ్యాజిక్‌

ఎంగ్డీ మ్యాజిక్‌

Feb 13, 2020 , 23:44:34
PRINT
 ఎంగ్డీ మ్యాజిక్‌
  • ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం

ఈస్ట్‌ లండన్‌ (దక్షిణాఫ్రికా): పేస్‌ బౌలర్‌ లుంగి ఎంగ్డీ చివరి రెండు ఓవర్లలో మ్యాజిక్‌ చేయడంతో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం సాధించింది. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ విజయానికి చివరి ఓవర్‌లో 7 పరుగులు అవసరం కాగా.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' ఎంగ్డీ (3/30) ఐదు రన్స్‌ మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి సఫారీ జట్టుకు విజయాన్నందించాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 177 పరుగులు చేసింది. బవుమా (43), డికాక్‌ (31), డసెన్‌ (31) తలా కొన్ని పరుగులు చేశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 176 పరుగులు చేసింది. జేసన్‌ రాయ్‌ (38 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్‌ మోర్గన్‌ (52; 7 ఫోర్లు, ఒక సిక్స్‌) విజృంభించడంతో ఇంగ్లండ్‌ విజయం నల్లేరుపై నడకే అని భావిస్తే.. చివర్లో ఒత్తిడికి గురైన ఇంగ్లిష్‌ జట్టు పరుగు తేడాతో ఓటమి పాలైంది.  చాన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన దక్షిణాఫ్రికా పేస్‌ గన్‌ స్టెయిన్‌ (1/33) ఫర్వాలేదనిపించాడు. 


logo