IPL 2026 | లక్నో ఈసారైనా.. మరో 6రోజుల్లో మొదలుకానున్న ఐపీఎల్
లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) త్వరలో మొదలుకానున్న ఐపీఎల్ సీజన్‌కు సర్వశక్తులతో సిద్ధమవుతున్నది. సరిగ్గా నాలుగేండ్ల క్రితం లీగ్‌లో అరంగేట్రం చేసిన లక్నోకు టైటిల్ కలగానే మిగిలిపోయింది. అంచనాలకు మించి తొలి రెండు సీజన్లు ప్లేఆఫ్స్‌లోకి దూసుకొచ్చిన లక్నో గత రెండు సార్లు మాత్రం లీగ్ దశలోనే తమ పోరాటాన్ని ముగించింది.
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) త్వరలో మొదలుకానున్న ఐపీఎల్ సీజన్‌కు సర్వశక్తులతో సిద్ధమవుతున్నది. సరిగ్గా నాలుగేండ్ల క్రితం లీగ్‌లో అరంగేట్రం చేసిన లక్నోకు టైటిల్ కలగానే మిగిలిపోయింది. అంచనాలకు మించి తొలి రెండు సీజన్లు ప్లేఆఫ్స్‌లోకి దూసుకొచ్చిన లక్నో గత రెండు సార్లు మాత్రం లీగ్ దశలోనే తమ పోరాటాన్ని ముగించింది. కేఎల్ రాహుల్ స్థానంలో నాయకత్వ పగ్గాలు అందుకున్న వికెట్‌కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ జట్టును అనుకున్న మేర ముందుకు నడిపించడంలో విఫలమయ్యాడు.
ఈసారి గత అనుభవాలను తిరుగరాస్తూ సమష్టి ప్రదర్శనతో సత్తాచాటాలని పంత్ సేన పట్టుదలతో ఉంది. మిగతా జట్లతో పోలిస్తే ప్లేయర్ల గాయాల బాధ లేకపోవడం ఒకింత ఊరటనిచ్చే అంశం కాగా, షమీ, నోకియా, మోహిసిన్ ఖాన్, అవేశ్‌ఖాన్, మయాంక్ యాదవ్ లాంటి పేసర్లతో ప్రత్యర్థి గుండెల్లో దడపుట్టిస్తున్నది. మరో ఆరు రోజుల్లో మొదలుకానున్న లీగ్‌లో లక్నో బలాలు, బలహీనతలపై సమగ్ర విశ్లేషణ.
బలం:
లక్నో జట్టులో హార్డ్హిట్టర్లకు కొదువలేదు. పొట్టి ఫార్మాట్లో తమ దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చే శక్తి ఉన్న ప్లేయర్లు లక్నో సొంతం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌పై తమదైన ఆటతీరుతో ముద్రవేసిన మార్క్మ్,్ర జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్..లక్నోకు కొండంత బలం. వీరిలో ఏ ఒక్కరు నిలదొక్కుకున్న మ్యాచ్ ఫలితం మారినట్లే. ఇటీవలి టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన మార్క్మ్.్ర.ఆసీస్ సారథి మిచెల్ మార్ష్‌తో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టే అవకాశముంది. మరోవైపు గత రెండు సీజన్లలో 499, 524 పరుగులతో జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన నికోలస్ పూరన్ వెలకట్టలేని ఆస్తి. అవసరమైతే కీపర్‌గా సేవలందించేందుకు సిద్ధంగా ఉండే పూరన్..మిడిలార్డర్‌తో పాటు ఆఖర్లో మెరుపులు మెరిపించడంలో దిట్ట. అయితే కెప్టెన్ పంత్ ఫామ్ ఆందోళన కల్గిస్తున్నది.
గత సీజన్లో ఘోరంగా విఫలమైన పంత్ ఈసారైనా మెరుపులు మెరిపిస్తాడని ఫ్రాంచైజీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి ఇంగ్లిస్, నోకియా, హసరంగ లాంటి ప్లేయర్లను వేలంలో తీసుకున్న లక్నో..వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ, అర్జున్ టెండూల్కర్ ట్రేడ్ ద్వారా జట్టుకు ఎంపిక చేసుకుంది. అయితే 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన షమీ దేశవాళీ సీజన్లో దుమ్మురేపాడు.
తన సూపర్ స్వింగ్‌తో అటు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో పాటు రంజీలో వికెట్ల వేట కొనసాగించాడు. ఎంత నిలకడగా రాణిస్తున్నా..జాతీయ సెలెక్టర్లు షమీ వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం ఒకింత నిరుత్సాహానికి గురిచేస్తున్నది. 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఇస్పటి నుంచే ప్లేయర్ల ఎంపికపై దృష్టి పెట్టిన బీసీసీఐ..షమీని ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. షమీకి తోడు నోకియా, అవేశ్, మోహిసిన్ జత కలిస్తే లక్నో ఎంతటి లక్ష్యాన్ని కాపాడుకోగల్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బలహీనత:
జట్టులో కొంత మందికి గాయాల బెడద తోడు ఫిట్నెస్ సమస్యలు జట్టుకు ప్రతికూలంగా మారనున్నాయి. మిస్టరీ స్పిన్నర్ హసరంగకు శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ మంజూరు కాలేదు. గాయం నుంచి కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తేనే ఎన్వోసీ ఇస్తున్నట్లు లంక బోర్డు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో హసరంగ ప్రాతినిధ్యంపై అస్పష్టత నెలకొన్నది. మరోవైపు దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ నోకియా తరుచూ గాయాల పాలు అవుతుండటం జట్టుకు ఆందోళన కల్గిస్తున్నది.
పేస్ బౌలింగ్ పరంగా పేపర్ మీద బలంగా కనిపిస్తున్న లక్నోకు ఫిట్నెస్ పెద్ద సమస్యగా మారింది. షమీ, అవేశ్‌ఖాన్, మయాంక్ యాదవ్ పూర్తి సీజన్ జట్టుకు అందుబాటులో ఉంటారా అన్నది తేలాల్సి ఉంది. వీరిలో ఏ ఒక్కరూ గాయపడ్డ సహచర ప్లేయర్లపై ప్రభావం చూపించనుంది. ఒక వేళ సీజన్ ఆరంభంలోనే షమీ తన రిథమ్ దక్కించుకుంటే లక్నో కష్టాలు తీరినట్లే.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

