IPL 2025 : టీమిండియాలో చోటు కోల్పోయిన లార్డ్స్ శార్థూల్కు జాక్‌పాట్ తగిలింది. ఐపీఎల్ 18వ సీజన్లో ఈ ఆల్‌రౌండర్ ఆడడం ఖరారైంది. ఈ లీగ్‌లో, టీ20ల్లో సుదీర్ఘ అనుభవమున్న శార్థూల్‌ను భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. గాయపడిన యువ పేసర్ మొహ్సిన్ ఖాన్ (Mohsin Khan) స్థానంలో శార్ధూల్‌ను తీసుకుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ లక్నో యాజమాన్యం ఆదివారం తమ ఎక్స్ ఖాతాలో శార్ధూల్‌కు స్వాగతం పలుకుతూ పోస్ట్ పెట్టింది.
నవంబర్‌లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ శార్ధూల్‌ను కొనేందుకు ఆసక్తి చూపించలేదు. ఇక ఐపీఎల్ 18వ సీజన్లో అతడికి చాన్స్ లేదని అనుకున్నారంతా. అయితే.. అనుకోకుండా శార్ధూల్‌పై ఇప్పుడు కోట్ల వర్షం కురిసింది. బ్యాటుతో, బంతితో రాణించగల సమర్ధుడైన శార్థూల్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ 2 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడింది. గాయం నుంచి కోలుకుంటున్న మొహ్సిన్ ఖాన్ స్థానంలో శార్ధూల్‌ను తీసుకొని.. తమ పేస్ బౌలింగ్‌ను బలోపేతం చేసుకుంది లక్నో. ఇదివరకే బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్‌ను సంప్రదించి లక్నో యాజమాన్యం.. తాజాగా శార్దూల్‌తో ఒప్పందం చేసుకోవడంతో తస్కిన్‌కు దారులు మూసుకుపోయినట్టేనని విశ్లేషకులు అంటున్నారు.
Headlines don’t matter, The Lord does 🫶
Shardul is home 💙 pic.twitter.com/nd6ouD3otX
— Lucknow Super Giants (@LucknowIPL) March 23, 2025
గతంలో పలు జట్ల తరఫున అద్భుత ప్రతిభ కనబరిచిన శార్థూల్ ఈసారి లక్నో తరఫున ఆల్‌రౌండ్ షో చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. 33 ఏళ్లున్న ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఇప్పటివరకూ 5 ఫ్రాంచైజీల తరఫున 95 మ్యాచ్‌లు ఆడాడు. రిషభ్ పంత్ సారథ్యంలోని ఎల్ఎస్జీ తమ తొలి పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును 24వ తేదీన ఢీ కొట్టనుంది.