Gayatri Bhargavi | బ్రతికున్న భర్తను థంబ్నెయిల్తో చంపేశారు.. iDream యూట్యూబ్ ఛానల్‌పై నటి తీవ్ర విమర్శలు
Gayatri Bhargavi | టాలీవుడ్ నటి భార్గవి ఐడ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి బ్రతికున్న నా భర్తను చనిపోయినట్లు చిత్రీకరించడమే కాకుండా తప్పుడు వార్తలను వార్తలను ప్రచారం చేస్తున్నట్లు ఐడ్రీమ్‌తో పాటు ఇతర యూట్యూబ్ ఛానల్స్‌పై ఆగ్రహాం వ్యక్తం చేసింది.
Gayatri Bhargavi – Idream Media | టాలీవుడ్ నటి భార్గవి ఐడ్రీమ్ (idream media) అనే యూట్యూబ్ ఛానల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి బ్రతికున్న నా భర్తను చనిపోయినట్లు చిత్రీకరించడమే కాకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నట్లు ఐడ్రీమ్‌తో పాటు ఇతర యూట్యూబ్ ఛానల్స్‌పై ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేసింది.
ఇటీవలే నేను ఐడ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. యాంకర్ స్వప్న పిలిచిందని వెళ్లాను. ఈ ఇంటర్వ్యూ కూడా బాగా జరిగింది. అయితే ఈ ఇంటర్వ్యూలో మా ఆయన ఆర్మీ ఆఫీసర్, బోర్డర్లో అతడి జీవితం ఎలా ఉంటుంది అనే దానిపై కూడా స్పందించాను. అయితే నేను మాట్లాడిన మాటలన్ని తీసుకుని ఒక తప్పుడు థంబ్‌నెయిల్స్‌ను ఐడ్రీమ్ క్రియేట్ చేసి యూట్యూబ్‌లో వదిలింది. ఈ థంబ్నెయిల్లో నా భర్త చనిపోయినట్లు అర్థం వచ్చేలా రాయడమే కాకుండా నా ఫ్యామిలీ ఫొటోలను పెట్టారు. ఐడ్రీమ్‌తో పాటు మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా ఒక ఆర్మీ అధికారితో పాటు అతడి భార్య గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. నేను ఒక్కటే అడగాలి అనుకుంటున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నారు. ఇదే విషయం గురించి యాంకర్ స్వప్నని సంప్రదించగా.. రెండు సార్లు డీలిట్ చేసి మళ్లీ అప్లోడ్ చేశారు. ఈ విషయంలో నాకు ఐడ్రీమ్ నుంచి సమాధానమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పాలంటూ భార్గవి చెప్పుకోచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన ప్రస్తుతం వైరల్‌గా మారింది.
బతికివున్నోణ్ణి చంపేసారు కదా…ఇదెక్కిడి దారుణం. pic.twitter.com/17t0QRZdYr
— devipriya (@sairaaj44) March 23, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

