Lords Test : పొట్టి క్రికెట్ వేళ్లూనుకుంటున్న ఈ కాలంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC)తో సుదీర్ఘ ఫార్మాట్‌కు జీవం పోసింది ఐసీసీ. డబ్ల్యూటీసీ సీజన్ ఏమంట మొదలైందో రెడ్ బాల్ క్రికెట్ కొత్త రూపు సంతరించుకుంది. టెస్టు గద (Test Mace)పోరుకు అర్హత సాధించేందుకును అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చరిత్రపుటల్లో నిలిచిపోయే మ్యాచ్‌కు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికైంది.
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో ఒకటైన మూడో టెస్టులో భారత్, ఇంగ్లండ్‌లు ‘నువ్వానేనా’ అన్నట్లు తలపడగా.. చివరకు ఆతిథ్య జట్టునే అదృష్టం వరించింది. మరీ ముఖ్యంగా ఐదో రోజు ఆట హైలెట్. ఓవైపు వికెట్లు పడుతున్నా.. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అలుపెరగని యోధుడిలా పోరాడిన తీరు అందర్నీ కట్టిపడేసింది. స్టేడియంలోని వీక్షకులను, కామెంటేటర్లను, టీవీలకు అతుక్తుపోయినవాళ్లను ఆద్యంతం మునివేళ్లపై నిలబెట్టి కడకు కన్నీళ్లను మిగిల్చిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపొందినా.. అసలైన విజేత టెస్టు క్రికెట్ అంటున్నారు మాజీ ఆటగాళ్లు. అవును.. నిజమేగా.
A Test match to remember at Lord’s 🤩#WTC27 | #ENGvIND
More ➡️ https://t.co/iCm88lmGc0 pic.twitter.com/Vl9HrVNpWY
— ICC (@ICC) July 14, 2025
టెస్టు క్రికెట్.. ఐదు రోజుల ఆట మాత్రమే కాదు. సెషన్ సెషన్‌కు ఉత్కంఠ రేపుతూ అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచుతుంది. లార్డ్స్‌లోనూ అచ్చంగా అదే జరిగింది. బర్మింగ్హమ్లోని ఎడ్జ్‌బాస్టన్‌లో సంచలన విజయంతో సిరీస్ సమం చేసిన భారత జట్టు రెట్టించిన ఉత్సాహంతో లార్డ్స్‌కు వచ్చింది. అనుకున్నట్టే తొలి ఇన్నింగ్స్‌లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా (5-74) బెంబేలెత్తించగా.. జో రూట్ సెంచరీతో మెరిసినా ఇంగ్లండ్‌ను 371కే కట్టడి చేసింది. అనంతరం కేఎల్ రాహుల్ క్లాస్ శతకానికి వైస్ కెప్టెన్ పంత్(74), జడేజా (72)ల అర్ధ శతకాలు తోడవ్వగా భారీ స్కోర్ దిశగా పరుగెత్తిన టీమిండియా అనూహ్యంగా కుప్పకూలింది. మూడో రోజు పంత్ రనౌట్ తర్వాత ఇంగ్లండ్ పేసర్లను ఎదుర్కోలేక టెయిలెండర్లు చేతులెత్తేయగా.. స్కోర్ సమం చేసి సంతృప్తి చెందింది.
𝐁𝐨𝐨𝐦 𝐁𝐨𝐨𝐦 𝐁𝐮𝐦𝐫𝐚𝐡 𝐢𝐬 𝐨𝐧 𝐟𝐢𝐫𝐞 𝐚𝐭 𝐋𝐨𝐫𝐝’𝐬! 🔥
He dismisses centurion Joe Root and sends Chris Woakes packing for a golden duck! 💥🦆
This is why he’s the World No. 1 bowler — single-handedly keeping Team India in control! 🇮🇳🐐
🏴 – 271/7 (87.2)… pic.twitter.com/iZ4mDlkz6S
— Sportskeeda (@Sportskeeda) July 11, 2025
అనంతరం నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌ను ఏస్ పేసర్ సిరాజ్ గట్టి దెబ్బకొట్టాడు. తొలి సెషన్ మొదలైన కాసేపటికే డేంజరస్ బెన్ డకెట్ (12), ఓలీ పోప్(4)లను ఔట్ చేసి పంచ్ ఇచ్చాడు. ఆ తర్వాత నితీశ్ ఓవర్లో క్రాలే వెనుదిరిగాడు. బంతి అందుకున్న వాషింగ్టన్ సుందర్ వికెట్ల వేటతో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. భోజనం విరామం తర్వాత జో రూట్(40), హ్యారీ బ్రూక్(23), బెన్ స్టోక్స్(33)లను బౌల్డ్ చేసి ఇంగ్లండ్ నడ్డివిరిచాడు. టీ సెషన్ తర్వాత బుమ్రా యార్కర్లతో చెలరేగగా.. 193కే ఆలౌటైంది బెన్ స్టోక్స్ సేన. ఆ క్షణం భారత అభిమానులు మన జట్టు విజయాన్ని ఇక ఎవరూ ఆపలేరు అనుకున్నారంతా.
స్వల్ప ఛేదనలో యశస్వీ జైస్వాల్ ధాటిగా ఆడి శుభారంభం ఇస్తాడనుకుంటే సీన్ రివర్సైంది. ఆర్చర్ (3-55) బౌలింగ్‌లో అతడు స్లిప్‌లో బ్రూక్ చేతికి దొరికిపోయాడు. కార్సే(2-30) తన పేస్ పవర్‌తో కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పాడు. నైట్ వాచ్‌మన్ ఆకాశ్ దీప్‌ను బౌల్డ్ చేసిన స్టోక్స్ నాలుగో రోజు నాలుగో వికెట్ అందించాడు. ఐదో రోజు భారత్ చరిత్రాత్మక విజయానికి 135 రన్స్ కావాలంతే. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి.. సెంచరీ హీరో రాహుల్, చిచ్చరపిడుగు పంత్, నితీశ్, జడేజా, సుందర్‌లో ఏ ఇద్దరు నిలబడినా లక్ష్యాన్ని కరిగించడం పెద్ద కష్టమేమీ కాదు. లార్డ్స్‌లో భారత జట్టు విజయపతాక ఎగురేయడం ఖాయం అనిపించింది.
గెలుపువాకిట నిలిచిన భారత్ ఐదో రోజు ఇంగ్లండ్‌కు షాకిస్తుందని అనుకుంటే అనూహ్యంగా మ్యాచ్‌ను అప్పగించేసింది. తొలి సెషన్లోనే పంత్‌ను బౌల్డ్ చేసి ఆర్చర్ ఇండియాకు ఝలక్ ఇచ్చాడు. 71కే సగం వికెట్లు పడినా రాహుల్ నిలబడుతాడనుకుంటే.. మరో పది రన్స్‌కే అతడు స్టోక్స్‌కు ఎల్బీగా దొరికిపోయాడు. సుందర్‌ను డకౌట్ చేసిన ఆర్చర్ గిల్ సేనను కష్టాల్లోకి నెట్టాడు. అయినా సరే రవీంద్ర జడేజా (61 నాటౌట్) పట్టు వదల్లేదు. నితీశ్ రెడ్డితో కలిసి విలువైన 30 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు దిశగా నడిపాడు. అయితే.. వోక్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ స్మిత్ చేతికి నితీశ్ క్యాచ్ ఇవ్వడంతో మ్యాచ్‌పై ఆశలు సన్నగిల్లాయి. కానీ.. జడ్డూ మాత్రం బుమ్రా(5) అండగా భారీ షాట్లతో దడపుట్టించాడు. జట్టును గెలిపించేందుకు ఏకంగా 53 బంతులు ఎదుర్కొన్న బుమ్రాను స్టోక్స్ పెవిలియన్ పంపాడు. అప్పటికీ స్కోర్.. 147.
That’s a fighting FIFTY from Ravindra Jadeja! 🙌
His 26th half-century in Test cricket 👏👏#TeamIndia need 35 more to win
Updates ▶️ https://t.co/X4xIDiSUqO#ENGvIND pic.twitter.com/j6gs2t3eR4
— BCCI (@BCCI) July 14, 2025
అప్పటికే ఇంగ్లండ్ విజయం ఖరారైంది. ఆ దశలో సిరాజ్ అసమానంగా పోరాడాడు. ఇంగ్లిష్ పేసర్ల బుల్లెట్ బంతుల్ని కాచుకుంటూ జడేజాకు తన శక్తికి మించి సహకరించాడు. ఆఖరి వికెట్ అయిన మియా భాయ్ క్రీజులో ధైర్యంగా నిలవగా.. మరో 23 రన్స్ జోడించి టీమిండియాను విజయానికి మరింత చేరువ చేశాడు జడేజా. మరో 21 రన్స్ కొడితే గెలుపు మనదే. ఈ ఇద్దరిలో ఒక్కరు ఔటైనా అంతే సంగతి. అందరిలో ఉత్కంఠ నెలకొన్న వేళ.. బషీర్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడిన సిరాజ్.. బంతిని అడ్డుకున్నాడు. కానీ, అది అనూహ్యంగా జంప్ అవుతూ వికెట్లను తాకింది. ‘అయ్యో జట్టును గెలిపించలేకపోయా’ నని స్పీడ్‌స్టర్ గుండెపగిలినంతగా బాధ పడ్డాడు. నాన్ స్ట్రయికర్ జడేజా అయితే.. లోలోపల ఎంతో కుమిలిపోయాడనుకో. మైదానంలోని ఈ ఇద్దరే కాదు.. భారత డ్రెస్సింగ్ రూమ్ మొత్తం కన్నీళ్లను తుడుచుకుంది. ఈ ఓటమితో సిరీస్‌లో ముందంజ వేసే అవకాశం చేజారినా ఓల్డ్ ట్రఫోర్డ్‌లో గోడకు కొట్టిన బంతిలా చెలరేగేందుకు గిల్ సేన సన్నద్ధమవుతోంది. ఆల్ ది బెస్ట్ టీమిండియా.
End of a thrilling Test match at Lord’s.#TeamIndia fought hard but it’s England who win the 3rd Test by 22 runs.
Scorecard ▶️ https://t.co/X4xIDiSUqO#ENGvIND pic.twitter.com/KkLlUXPja7
— BCCI (@BCCI) July 14, 2025