T20 World Cup : పొట్టి ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్(Bangladesh) జట్టు సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈసారి ఐసీసీ ట్రోఫీ లక్ష్యంగా పెట్టుకున్న బంగ్లా సెలెక్టర్లు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేశారు. సీనియర్ ఆటగాడు అయిన లిటన్ దాస్(Litton Das)కు టీ20 పగ్గాలు అప్పంగించారు. 2026 పొట్టి వరల్డ్ కప్ వరకూ అతడు కెప్టెన్‌గా కొనసాగుతాడని ఆదివారం బీసీబీ అధికారులు వెల్లడించారు.
ఓపెనర్‌గా విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడే లిటన్‌కు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. దాంతో, పొట్టి ఫార్మాట్లో అతడిని అత్యుత్తమ ఛాయిస్‌గా భావించారు బంగ్లా సెలెక్టర్లు. కాబట్టి.. వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని యూఏఈ వేదికగా త్వరలో పాకిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం స్క్వాడ్‌కు లిటన్‌ను సారథిగా ప్రకటించింది బీసీబీ. యువ ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
📢 Squad Announcement
Bangladesh Men’s Team is set for back-to-back T20I challenges! 🇧🇩
🔜 Tour of UAE & Pakistan
🆚 UAE – 2 T20Is
🆚 Pakistan – 5 T20Is
📅 May 17 – June 3, 2025#BCB #BangladeshCricket #BANvUAE #BANvPAK #T20Cricket #CricketVibes pic.twitter.com/E8kiEGIdP4— Bangladesh Cricket (@BCBtigers) May 4, 2025
‘వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్ కప్‌లో లిటన్ దాస్ బంగ్లాదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అతడి అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతం టీ20 టీమ్‌లో లిటన్లాంటి అనుభవజ్ఞుడు లేడు. అందుకే.. అతడి ప్రస్తుత ఫామ్‌తో సంబంధం లేకుండా అతడి టీ20 క్రికెట్ సామర్థ్యాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాం. అతడు నిజంగా మా జట్టుకు వెలకట్టలేని ఆస్తి’ అని బీసీబీ క్రికెట్ వ్యవహరాల ఛైర్మన్ నజ్ముల్ అబెదిన్ ఓ ప్రకటనలో చెప్పాడు. త్వరలోనే పాకిస్థాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌తో లిటన్‌కు సారథిగా తొలి సవాల్ ఎదురుకానుంది. 2026 పొట్టి వరల్డ్ కప్ పోటీలకు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
బంగ్లాదేశ్ స్క్వాడ్ : తంజిద్ హసన్, పర్వేజ్ హొసేన్, సౌమ్యా సర్కార్, నజ్ముల్ హుసేన్ శాంటో, తౌహిద్ హృదొయ్, షమిమ్ హొసేన్, జకీర్ అలీ, రిషద్ హొసేన్, మహెదీ హసన్(వైస్ కెప్టెన్), తన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహ్ముద్, తంజిమ్ హసన్ షకీబ్, నహిద్ రానా, షొరిఫుల్ ఇస్లాం.