INDW vs AUSW | అర్ధశతకాలతో మెరిసిన లిచ్‌ఫీల్డ్, మెక్‌గ్రాత్.. తొలి వన్డేలో ఆసీస్ జయభేరి
INDW vs AUSW : ముంబైలోని వాంఖడేలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా గెలుపొందింది. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో 6 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ సేనను ఓడించింది. భారత్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్య ఛేదనలో యువకెరటం...
INDW vs AUSW : ముంబైలోని వాంఖడేలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా గెలుపొందింది. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో 6 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ సేనను ఓడించింది. భారత్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్య ఛేదనలో యువకెరటం ఫొబె లిచ్‌ఫీల్డ్(78), ఎలిసా పెర్రీ(75), ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్(68) హాఫ్ సెంచరీలతో మెరిశారు. దాంతో, ఆసీస్ భారీ టార్గెట్‌ను 46.3 ఓవర్లలోనే ఛేదించింది. రికార్డుల పరంగా చూస్తే.. మహిళల క్రికెట్లో ఇది రెండో అత్యధిక ఛేదన కావడం విశేషం.
భారీ ఛేదనలో ఆసీస్ తొలి ఓవర్లోనే ఒక వికెట్ కోల్పోయింది. రేణుకా సింగ్ ఓవర్లో ఓపెనర్ హేలీ(0) ఔటయ్యింది. కానీ, ఎలిసా పెర్రీ(11), ఫొబే లిచ్‌ఫీల్డ్(3) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి పైచేయి సాధించారు. వీళ్లు రెండో వికెట్‌కు 148 పరుగులు జోడించి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అనంతరం బేత్ మూనీ(42)తో కలిసి మెక్‌గ్రాత్ (68) జట్టును విజయం వైపు నడిపించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
Ellyse Perry, Phoebe Litchfield and Tahlia McGrath hit half centuries as Australia ace their chase in the first ODI #SAvIND
▶️ https://t.co/a3EHOcBNlQ pic.twitter.com/b7EU3s7st0
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2023
A late contender for catch of the year pic.twitter.com/WSdIHqw3VA
Sneh Rana 👏 #INDvAUS
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2023
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు బాదింది. టాపార్డర్ విఫలమైనప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్(82), ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్(62 నాటౌట్) అర్ధ శతకాలతో చెలరేగారు. ఓపెనర్ యస్తికా భాటియా(49) కూడా రాణించడంతో భారత్.. ఆసీస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కంగారూ బౌలర్లలో అషే గార్డ్నర్, వరేహమ్ తలా రెండు వికెట్లు తీశారు.
ఇవి కూడా చదవండి
- IND vs RSA | కోహ్లీ పోరాటం వృథా.. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా భారీ విజయం
- Ayodhya Dham | రంగురంగుల కాంతుల్లో తళుకులీనుతున్న ఆయోధ్య ధామ్ జంక్షన్.. Video
- MLA Jagdish Reddy | బీఆర్ఎస్ నేతల పై దాడి దుర్మార్గమైన చర్య : ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

