IND vs RSA | కోహ్లీ పోరాటం వృథా.. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా భారీ విజయం
IND vs RSA : సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా(South Africa) భారీ విజయం సాధించింది. పేసర్లు రబడ, బర్గర్ చెలరేగడంతో ఇన్నింగ్స్ 32 పరుగులతో టీమిండియా(Team India)పై గెలుపొందింది.163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ సేన 133 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(76) ఒంటరి పోరాటం చేసినా...
IND vs RSA : సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా(South Africa) భారీ విజయం సాధించింది. పేసర్లు రబడ, బర్గర్ చెలరేగడంతో ఇన్నింగ్స్ 32 పరుగులతో టీమిండియా(Team India)పై గెలుపొందింది.163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ సేన 133 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(76) ఒంటరి పోరాటం చేసినా ఇన్నింగ్స్ ఓటమి తప్పించలేకపోయాడు. జాన్సెన్ ఓవర్లో భారీ షాట్ ఆడిన కోహ్లీ.. బౌండరీ వద్ద రబాడ చేతికి చిక్కాడు. దాంతో ప్రొటిస్ జట్టు రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అరంగేట్రంలోనే బర్గర్ 7 వికెట్లతో మెరవగా.. రబడ కూడా ఏడు వికెట్లతో సత్తా చాటాడు.
తొలి ఇన్నింగ్స్‌లో భారత టాపార్డరను కకావికలం చేసిన రబాడ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తడాఖా చూపించాడు. అతడికి బర్గర్ తోడవ్వడంతో ఇండియా రెండు సెషన్లలోనే ఆలౌటయ్యింది. సఫారీలను 408 పరుగులకు కట్టడి చేసిన భారత్.. ఇన్నింగ్స్ ఆరంభమైన కాసేపటికే వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(0)ను రబాడ డకౌట్ చేశాడు. ఆ కాసేటికే కుర్రాడు యశస్వీ జైస్వాల్(5)ను బర్గర్ సూపర్ డెలివరీతో బోల్తా కొట్టించాడు.
South Africa wallop India inside 3 days 🇿🇦 https://t.co/d8VcaIlWPZ | #SAvIND pic.twitter.com/jqW2vboESo
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2023
13 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన దశలో శుభ్‌మన్ గిల్(26), విరాట్ కోహ్లీ(18)లు ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ, జాన్సేన్ అద్భుతమైన బంతితో గిల్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై బర్గర్ రెచ్చిపోయాడు. వరుస బంతుల్లో సెంచరీ వీరుడు రాహుల్(4), అశ్విన్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. ఠాకూర్(2)ను రబాడ ఔట్ చేసి రోహిత్ సేనను మరింత కష్టాల్లోకి నెట్టాడు. దాంతో, సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న భారత జట్టు ఇక సిరీస్ డ్రా చేసుకోవడంపై దృష్టి పెట్టనుంది.
డీన్ ఎల్గర్(185)

మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 408 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు భారత బౌలర్లకు పరీక్ష పెట్టిన ఓపెనర్ డీన్ ఎల్గర్(185 : 287 బంతుల్లో 28 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయాడు. మార్కో జాన్సేన్(84 నాటౌట్)తో కలిసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అయితే.. డబుల్ సెంచరీదిశగా దూసుకెళ్తున్న అతడిని శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. ఆ వెంటనే గెరాల్డ్ కోఎట్జీ(18)ని అశ్విన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన రబాడ(1), బర్గర్(0)లను బుమ్రా బౌల్డ్ చేసి సఫారీ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
ఇవి కూడా చదవండి
- MLA Jagdish Reddy | కేసీఆర్ అభిమానిపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి
- Traffic Challan | ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపులకు ఫుల్ గిరాకీ.. ఓవర్‌లోడ్‌తో మొరాయిస్తున్న సర్వర్
- Brahmanandam | బ్రహ్మానందం జీవితంపై పుస్తకం.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

