Brahmanandam | బ్రహ్మానందం జీవితంపై పుస్తకం.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
Brahmanandam | తెలుగు ఇండస్ట్రీ అల్ టైమ్ గ్రేట్ కమెడియన్స్‌లో బ్రహ్మానందం అందరికంటే ముందుంటాడు. ఈ తరం ప్రేక్షకులకు, ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలు చేయలేకపోయినా కూడా బ్రహ్మానందం మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటాడు.
Brahmanandam | తెలుగు ఇండస్ట్రీ అల్ టైమ్ గ్రేట్ కమెడియన్స్‌లో బ్రహ్మానందం అందరికంటే ముందుంటాడు. ఈ తరం ప్రేక్షకులకు, ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలు చేయలేకపోయినా కూడా బ్రహ్మానందం మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటాడు. ప్రత్యక్షంగా ఆయన కనిపించకపోయినా మీమ్స్ రూపంలో ఎప్పుడు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాడు బ్రహ్మానందం. రీసెంట్గా ‘కీడా కోలా’ అనే సినిమాలో తాత పాత్రలో మెరిసి అందరిని అలరించాడు. అయితే ఈ లెజెండరీ కమెడియన్ ఆత్మకథ మీద ఒక పుస్తకం వచ్చింది.
ఈ ఆత్మకథను స్వయంగా బ్రహ్మానందంమే రాయగా.. ఈ పుస్తకానికి ‘నేను .. మీ బ్రహ్మానందం’ అనే టైటిల్ పెట్టాడు. బ్రహ్మానందం జీవితంలోని అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలను ఆయన ఈ పుస్తకంలో రాసుకొచ్చారని సమాచారం. ప్రస్తుతం ఈ పుస్తకం ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అమెజాన్‌తో పాటు ఫ్లిఫ్ కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి స్వయంగా బ్రహ్మానందంమే చిరుకు అందజేశాడు. ఈ సందర్భంగా ఆ అనందపు క్షణాలను పంచుకుంటూ చిరంజీవి ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాడు.
”నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా ‘నేను’ అనే పుస్తకరూపంలో మనకందిచటం ఎంతో ఆనందదాయకం. తానే చెప్పినట్టు ‘ఒకరి అనుభవం, మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు , మార్గదర్శకము అవ్వొచ్చు. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తి గా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ పుస్తక ప్రచురణ కర్తలయిన ‘అన్వీక్షికి’ వారిని అభినందిస్తున్నాను.” అంటూ చిరు ఎక్స్‌లో రాసుకోచ్చాడు.
నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా
తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో
తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన
ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా… pic.twitter.com/O6M8dEFqBZ— Chiranjeevi Konidela (@KChiruTweets) December 28, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krishna | బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్.. నూతన జడ్పీ చైర్మన్‌కు ఎమ్మెల్యే కీలక సూచనలు!
Trisha | త్రిష రాజకీయ వారసురాలంటూ ప్రకటన.. జయలలితతో పోలికలు, తమిళనాట కొత్త సేవా సంస్థ!
Ruhani Sharma | ‘ఆకాశంలో ఒక తార’లో రుహానీ శర్మ సొంత డైలాగ్స్ .. దర్శకుడు పవన్ సాదినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
Dada | డిసెంబర్ 24న బాలయ్య ‘దాదా’ జాతర.. ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇస్తామంటూ మేకర్స్ హామీ!
Varanasi | యాపిల్ మ్యాప్స్‌లో కనిపించిన ‘వారణాసి’ భారీ కాశీ సెట్.. ఏరియల్ వ్యూ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

