కోల్‌కతా: ఆధునిక సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనకు రానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. పలు ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు గాను మెస్సీ భారత్‌కు రానున్నాడని సమాచారం. డిసెంబర్ 12 అర్ధరాత్రి కోల్‌కతాకు చేరుకోనున్న అర్జెంటీనా సారథి.. మూడు రోజుల పాటు ఇక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొని 15 అర్ధరాత్రి తిరుగు ప్రయాణమవుతాడని తెలుస్తున్నది. కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీలో నిర్వహించబోయే కార్యక్రమాల్లో మెస్సీ పాల్గొంటాడని వినికిడి. దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుంది.