Lionel Messi : అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) కొత్త క్లబ్ ఇంటర్ మియామి(Inter Miami) తరఫున ఇరగదీస్తున్నాడు. ఈ ఫుట్‌బాల్ మాంత్రికుడు ప్రతి మ్యాచ్‌లో గోల్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరో విషయం ఏంటంటే..? గోల్ కొట్టిన ప్రతిసారి హాలీవుడ్ సినిమాల్లోని సూపర్ హీరోల పాత్రల్ని అనుకరిస్తూ సంబురాలు చేసుకోవడం మెస్సీకి అలవాటు. గతంలో అతను థోర్(Thor), బ్లాక్ పాంథర్ (Black Panther) హీరోలను ఇమిటేట్ చేశాడు. తాజాగా సూపర్ మ్యాన్‌గా ప్రపంచమంతా పేరొందిన ‘స్పైడర్ మ్యాన్'(Spiderman) సెలబ్రేషన్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు.
లీగ్స్ కప్(Leagues Cup) క్వార్టర్ ఫైనల్లో చార్లొట్టే(Charlotte) టీమ్‌పై మెస్సీ 86వ నిమిషంలో గోల్ కొట్టాడు. అనంతరం సంతోషం పట్టలేక స్పైడర్ మ్యాన్ తరహాలో చేతుల్ని కదిలించి సంబురాలు చేసుకున్నాడు. అదంతా కెమెరాలో రికార్డయ్యింద. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో మియామి 4-0తో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లింది.
Let do it Spiderman #Messi𓃵#InterMiamiCF#spiderman#Messi pic.twitter.com/3hyYptjHJV
— EvansXtraT (@EvansXtrat) August 12, 2023
Avengers are myth, Leo Messi is REAL! 🐐 pic.twitter.com/Fj3BN8YlTf
— Factos Football (@Factos_media) August 12, 2023
నిరుడు అర్జెంటీనాకు వరల్డ్ కప్(FIFA World Cup 2022) అందించిన మెస్సీ ఈమధ్యే మియామి క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. పారిస్ సెయింట్ జర్మనీ(PSG club Germany)తో రెండేళ్ల కాంట్రాక్ట్ ముగియడంతో అతను కొత్త క్లబ్‌కు ఆడాలని నిర్ణయించుకున్నాడు. అందుకని స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా, సౌదీ అరేబియా క్లబ్ అల్ హిలాల్ నుంచి భారీ ఆఫర్ వచ్చినా తిరస్కరించాడు.