ఢిల్లీ: భారత్ ఆతిథ్యమిచ్చిన ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో లిన్ చున్-యి (చైనీస్ తైపీ), అన్ సె యంగ్ (దక్షిణ కొరియా) టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో భాగంగా పురుషుల సింగిల్స్ తుదిపోరులో ప్రపంచ 12వ ర్యాంకర్ లిన్ చున్..
21-10, 21-18తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా)ను మట్టికరిపించి తన కెరీర్లో తొలి సూపర్ 750 టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఇక మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నెంబర్ వన్ అయిన యంగ్.. 21-13, 21-11తో చైనా అమ్మాయి వాంగ్ జియి పై గెలిచి ఈ సీజన్లో రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది.