Lara Wolvaardt : వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం డీవై పాటిల్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికాలు తొలి కప్ కోసం అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. ‘కొత్త ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించేది ఎవరు?’ అనే ప్రశ్నకు ఇరుజట్ల కెప్టెన్లు ‘మేమే’ అంటున్నారు. అయితే.. ఫైనల్లో తమకంటే టీమిండియాపైనే ఒత్తిడి ఎక్కువని చెబుతోంది సఫారీ కెప్టెన్ లారా వొల్వార్డ్త్ (Lara Wolvaardt) వెల్లడించింది. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన తను టైటిల్ పోరు కోసం తాము ఎక్కువగా ఆలోచించడం లేదని చెప్పింది.
‘మేము మొదటిసారి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నాం. అలాఅనీ మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. గతంతో సంబంధం లేకుండా కొత్తగా మా ప్రయాణాన్ని మొదలుపెట్టాలని భావిస్తున్నాం. నిజం చెప్పాలంటే భారత జట్టుపైనే ఒత్తిడి ఎక్కువ. ఎందుకుంటే.. దేశం మొత్తం వాళ్లకు మద్దతుగా ఉంది. స్టేడియంలోని ప్రేక్షకులంతా టీమిండియా గెలవాలని కోరుకుంటారు. కాబట్టి మేము కూడా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తరహాలో కప్ గెలిచి భారత ప్రేక్షకులను నిశబ్దంలోని నెట్టాలని అనుకుంటున్నాం. కానీ, అందుకు మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది’ అని లారా వెల్లడించింది.
Laura wolvaardt-Nothing more satisfying than hearing a big crowd go silent .✌🏻 pic.twitter.com/6sxL5CBcan
— Dumbledore (@JS1214f) November 1, 2025
పదమూడో సీజన్ వరల్డ్ కప్‌లో దంచేస్తున్న సఫారీ కెప్టెన్ జట్టు విజయాల్లో కీలకం అవుతోంది. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 169 పరుగులతో చెలరేగిన తను.. ఫైనల్లో పెద్ద ఇన్నింగ్స్ ఆడితే భారత బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలుస్తున్న తను 8 ఇన్నింగ్స్‌ల్లో 97.92 స్ట్రయిక్ రేటుతో 470 రన్స్ సాదించింది. భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన 389 పరుగులతో రెండో స్థానంలో ఉంది.
𝟐𝟎𝟐𝟓 𝐡𝐚𝐬 𝐛𝐞𝐞𝐧 𝐚 𝐝𝐫𝐞𝐚𝐦 𝐲𝐞𝐚𝐫 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚 𝐚𝐧𝐝 𝐒𝐨𝐮𝐭𝐡 𝐀𝐟𝐫𝐢𝐜𝐚! 🌟
The Hall of Champions awaits its next member. 🏛️
Harmanpreet Kaur or Laura Wolvaardt — who will take the glory this time? ✨🇮🇳🇿🇦#INDvSA #Champions #CWC25 #SKC #Sportskeeda pic.twitter.com/Uq7Y6puO7s
— Sportskeeda (@Sportskeeda) November 1, 2025
ఇప్పటివరకూ 34 మ్యాచుల్లో భారత్ 20 విజయాలు సాధించగా.. సఫారీ టీమ్ 13కే పరిమితమైంది. కానీ, ఫైనల్లో ఒత్తిడికి లోనవ్వకుండా ఆడిన జట్టుకే గెలుపొందే అవకాశాలెక్కువ. నాకౌట్ పోరులో ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని చేరుకున్న టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఉంది.