ఢిల్లీ : ఐపీఎల్లో రెండు ఫ్రాంచైజీ (రాజస్థాన్, బెంగళూరు)ల అమ్మకంపై లక్నో యజమాని సంజీవ్ గొయెంకా ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ మిస్‌ఫైర్ అయింది. దీనికంతటికీ ఐసీసీ చైర్మన్ జై షాకు క్రెడిట్ ఇవ్వబోయిన గొయెంకాకు ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
గొయెంకా తన పోస్ట్‌లో ‘రాజస్థాన్, బెంగళూరు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఈ విలువ పటిష్టమైన ఐపీఎల్ నిర్మాణం ద్వారా ఏర్పడింది’ అని పేర్కొన్నాడు. దీనికి లలిత్ మోదీ స్పందిస్తూ.. నిజంగా ఈయనకు మతి పోయినట్టుందని కౌంటర్ ఇచ్చాడు.