Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ (Lakshya Sen) దూసుకెళ్తున్నాడు. విశ్వ క్రీడల్లో కష్టమైన డ్రా లభించినా సంచలన ఆటతో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. గురువారం జరిగిన 16వ రౌండ్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన హెచ్‌హెస్ ప్రణయ్ (HS Prannoy)పై లక్ష్యసేన్ గెలుపొందాడు.
విశ్వ క్రీడల్లో అదరగొడుతున్న లక్ష్యసేన్ జోరు ముందు ప్రణయ్ నిలువలేకపోయాడు. బుధవారం
39 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 21-12, 21-6తో ప్రణయ్‌పై పైచేయి సాధించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీస్ బెర్తు కోసం జరిగే పోరులో చైనీస్ తైపీ షట్లర్ చౌ థియెన్ చెన్‌తో తలపడనున్నాడు. పురుషుల సింగిల్స్‌లో పతకం ఆశలు రేపుతున్న లక్ష్యసేన్‌కు ప్రణయ్ ఓ మాట చెప్పాడు. గట్టిగా పోరాడు. దేశానికి పతకం తీసుకొని రా అని ప్రణయ్ యువ షట్లర్‌కు సందేశమిచ్చాడు.
I was not sure what to expect coming into these Olympic Games, with so many uncertainties. But then, that’s how sport works. I still wanted to be on that podium, but sometimes the journey teaches you more than the destination. A special shoutout to Lakshya keep fighting and bring… pic.twitter.com/Ua3RIsPySl
— PRANNOY HS (@PRANNOYHSPRI) August 2, 2024
‘ఈ ఒలింపిక్స్‌లో నేను ఏమీ ఆశించానో కచ్చితంగా చెప్పలేను. చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఆటలో ఇవన్నీ భాగమే. ఇప్పటికీ నేను పోడిమం మీద నిలబడాలి అనుకుంటున్నా. లక్ష్యసేన్ దేశానికి పతకంతో తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అని ప్రణయ్ తెలిపాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ చిరాగ్ జోడీ, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధులు నిరాశపరిచిన విషయం తెలిసిందే.