Indonasia Open : ఇండోనేషియా ఓపెన్‌లో పతకంపై ఆశలు రేపిన భారత యువకెరటం లక్ష్యసేన్(Lakshya Sen) పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన అతడు అనూహ్యంగా ఇంటి దారి పట్టాడు. సెమీస్ బెర్తు కోసం శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో.. డెన్మార్క్ ఆటగాడు అండర్స్ ఆంటోన్సెన్(Anders Antonsen)కు 14వ ర్యాంకర్ లక్ష్యసేన్ గట్టి పోటీ ఇచ్చాడు.
అయితే.. కీలక సమయంలో పాయింట్లు గెలవలేక లక్ష్యసేన్ 22-24, 18-21తో మ్యాచ్ చేజార్చుకున్నాడు. ఈ విజయంతో భారత స్టార్‌పై అండర్స్ తన రికార్డును 3-2 మెరుగుపర్చుకున్నాడు. తొలి సెట్లో లక్ష్యసేన్, అండర్స్లు పోటాపోటీగా ఆడారు. ఒకదశలో డెన్మార్క్ స్టార్ 4-0తో ఆధిక్యంలోకి వెళ్లినా.. ఆ తర్వాత లక్ష్యసేన్ తన రాకెట్ పవర్ చూపిస్తూ 5-5తో స్కోర్ సమం చేశాడు.
Close, so close 💔
Well played Lakshya, end of 🇮🇳 campaign.
📸: @badmintonphoto#IndonesiaOpen2024#Badminton pic.twitter.com/4T6IaVp4Op
— BAI Media (@BAI_Media) June 7, 2024
అంతేకాదు 15-11తో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. కానీ, ఒత్తిడిని తట్టుకోలేక రెండు పాయింట్లతో తొలి సెట్ కోల్పోయాడు. ఇక రెండో రౌండ్లో ఇద్దరూ నువ్వానేటా అన్నట్టు తలపడినా చివరకు అండర్స్ మూడు పాయింట్లతో లక్ష్యసేన్ సెమీఫైనల్ ఆశలపై నీళ్లు చల్లాడు. తర్వాత రౌండ్లో అండర్స్ 8వ సీడ్ కున్లవుత్ వితిద్సర్న్తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.