హైదరాబాద్ : నాటుసారాను తుదిముట్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎక్సైజ్ శాఖ ముమ్మర దాడులు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి(Kalvakurti) ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కురుమిద్ద క్రాస్ రోడ్డులో కారులో అక్రమంగా తరలిస్తున్న బెల్లాన్ని(Jaggery seized) ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బెల్లాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు(Excise Police) తనిఖీలు చేపట్టారు.
హైదారాబాద్ గంజ్ మార్కెట్ నుంచి కారులో అక్రమంగా తరలిస్తుండగా తనిఖీ చేసి 12బ్యాగుల్లో 360 కిలోల బెల్లాన్ని, 40 కిలోల అల్లం, నాలుగు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ జె.వెంకటరెడ్డి తెలిపారు. నిందితులు కొత్తపల్లి తండాకు చెందిన కాట్రావత్ రవి, వెంకటాపూర్ తండాకు చెందిన జగన్ నాయక్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిలో సీఐ శంకర్తోపాటు కల్వకుర్తి సీఐ వెంకటరెడ్డి, మహేష్, నార్య, రఘు, భిక్షపతి పాల్గన్నారు.