US Open : యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్(Lakshya Sen) పోరాటం ముగిసింది. పతకంపై ఆశలు రేపిన అతను సెమీఫైనల్లో పోరాడి ఓడిపోయాడు. చైనా క్రీడాకారుడు లీ షి ఫెంగ్(Li Shi Feng)తో చేతిలో అనూహ్యంగా కంగుతిన్నాడు. గంట 16 నిమిషాలు జరిగిన మ్యాచ్‌లో 17-21, 24-22, 17-21తో ఓటమి పాలయ్యాడు. ఫెంగ్‌పై మెరుగైన రికార్డు ఉన్న లక్ష్యసేన్ ఈజీగా ఫైనల్ చేరుతాడని అనుకున్నారంతా.
ఎందుకంటే..? వారం క్రితమే కెనడా ఓపెన్(Canada Open 2023, ) ఫైనల్లో లక్ష్యసేన్ అడిని ఓడించి ట్రోఫీ అందుకున్నాడు. కానీ, అద్భుతంగా ఆడిన చైనా టెన్నిస్ స్టార్ రెండు సెట్లలో అధిక్యం కనబరిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దాంతో, వరుసగా రెండో టైటిల్ నెగ్గాలనుకున్న లక్ష్యసేన్‌కు నిరాశే మిగిలింది.
లక్ష్యసేన్, లీ షి ఫెంగ్
ఈ సీజన్లో లక్ష్యసేన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వారం కిందటే కెనడా ఓపెన్ టైటిల్ సాధించాడు. దాంతో, ఈ ఏడాది తొలి డబ్ల్యూటీఏ టూర్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. యూఎస్ ఓపెన్ టోర్నమెంట్లో అదే జోరు కొనసాగించాడు. క్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన 19 ఏళ్ల ఎస్ శంకర్ ముత్తుస్వామి(S Sankar Muthusamy)పై గెలుపొందాడు. వరుస సెట్లో 21-10 21-17తో అతడిని చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లాడు. లక్ష్యసేన్ నిష్క్రమణతో యూఎస్ ఓపెన్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో పతకం గెలుస్తుందనుకున్న పీవీ సింధు(PV Sindhu) క్వార్టర్స్ చేరలేకపోయింది. ఈ ఏడాది ఆమె క్వార్టర్స్‌లోనే వెనుదిరగడం ఇది వరుసగా రెండోసారి. కెనడా ఓపెన్, మలేషియా మాస్టర్స్‌లో సింధు పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది.