Japan Open | తొలిరౌండ్ దాటని ఆయుష్, లక్ష్యసేన్.. ఆశలన్నీ సింధుపైనే..!
Japan Open : టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్(Japan Open)లో భారత యువ షట్లర్లు తీవ్రంగా నిరాశపరిచారు. తొలి రౌండ్లోనే లక్ష్యసేన్, ఆయుశ్ షెట్టిలు ఇంటిదారి పట్టారు.
Japan Open : టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్(Japan Open)లో భారత యువ షట్లర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఇప్పటికే సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ గాయంతో ఈ సూపర్ 750 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించగా.. కుర్రాళ్లు లక్ష్యసేన్(Lakshya Sen), ఆయుశ్ షెట్టిలు సైతం ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లోనే సేన్, ఆయుశ్ ఓటమి పాలయ్యారు. స్థానిక షట్లర్ కొకి వటనాబే చేతిలో సేన్ కంగుతినగా.. థాయ్‌లాండ్‌కు చెందిన రెండో సీడ్ కున్లవుత్ విటిడ్సర్న్తో పోరాడి ఓడాడు ఆయుష్.
ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్‌లో భారత షట్లర్లు తేలిపోయారు. ఫేవరెట్ లక్ష్యసేన్, ఆయుష్ శెట్టిలు తొలిరౌండ్లోనే వెనుదిరిగారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జపాన్ కుర్రాడు కొకి వటనాబే ధాటికి సేన్ చేతులెత్తేశాడు. తొలి సెట్‌ను 16-21తో అలవోకగా కోల్పోయిన భారత స్టార్ రెండో సెట్లోనూ పుంజుకోలేదు. 17వ ర్యాంకర్ వటనాబె శక్తివంతమైన స్మాష్‌లతో విరుచుకుపడి 21-14తో గెలుపొందాడు. దాంతో సేన్ నిరాశగా కోర్టును వీడాడు.
Home favourite Koki Watanabe 🇯🇵 competes against Lakshya Sen 🇮🇳.#BWFWorldTour #JapanOpen2026 pic.twitter.com/HnG6ZE1pmx
— BWF (@bwfmedia) July 15, 2026
ఆయుష్ పోటాపోటీగా
మరో మ్యాచ్‌లో ఆయుష్ శెట్టి మాత్రం రెండో సీడ్ ఆటగాడు కున్లవుత్ విటిడ్సర్న్(థాయ్‌లాండ్)తో హోరాహోరీగా తలపడ్డాడు. ఇద్దరూ పోటాపోటీగా ఆడి చెరొక సెట్ గెలిచారు. దాంతో, నిర్ణయాత్మక మూడో సెట్ అనివార్యమైంది.
#JapanOpenSuper750 #JapanOpen2026
Ayush Shetty does well to keep in touch with Kunlavut Vitidsarn right through, plays a couple of fine points to make it 19-19 from 16-19, but eventually drops the opening game 19-21 against the former world champion.
📹 BWF pic.twitter.com/r4x2Kf5ILD
— Vinayakk (@vinayakkm) July 15, 2026
చివరి సెట్లోల అత్యుత్తమ ఆట కనబరిచిన కున్లవుత్ 21-15తో గెలుపొంది రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. సేన్, ఆయుశ్ల ఓటమితో పురుషుల బృందం వెనుదిరగగా.. జపాన్ ఓపెన్‌లో పతకం ఆశలన్నీ పీవీ సింధుపైనే ఉన్నాయి. తొలి రౌండ్ దాటిన తెలుగు తేజం గురువారం నాడు హన్ యూ(చైనా)ను రెండో రౌండ్లో ఢీకొట్టనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

