Team India Victory Parade | దారిపొడవునా నీరాజనాలు.. మువ్వన్నెల జెండా రెపరెపలు.. సంబురంగా ‘విక్టరీ పరేడ్’.. వీడియో
Team India Victory Parade : జగజ్జేతలుగా స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టు (Team India)కు అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్ (Victory Parade) కన్నుల పండువగా సాగుతోంది. వాంఖడే స్టేడియానికి చేరుకున్నాక అక్కడ భారత క్రికెట్ బోర్డు (BCCI) వరల్డ్ కప్ విజేతలను ఘనంగా సత్కరించనుంది.
Team India Victory Parade : జగజ్జేతలుగా స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టు(Team India)కు అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్(Victory Parade) కన్నుల పండువగా సాగుతోంది. అశేషమైన అభిమానులు దారిపొడవునా నీరాజనాలు పలుకుతూ… ‘జయహో టీమిండియా’ నినాదాలతో భారత క్రికెటర్ల మీద అభినందల వర్షం కురుపిస్తున్నారు. మువ్వన్నెల జెండాలు చేతబూని ‘ఈ విజయం చారాత్రాత్మకం’ అంటూ రోహిత్ సేన ఘనతను కీర్తిస్తున్నారు.
అనుకున్న సమయం కంటే ఆలస్యంగా పరేడ్ మొదలైనా సరే.. కొంచెం కూడా అలసట లేకుండా ‘ఇండియా.. ఇండియా’.. ‘కోహ్లీ.. కోహ్లీ’.. ‘రోహిత్.. రోహిత్’.. నినాదాలతో మరైన్ డ్రైవ్‌కు జోష్ తెస్తున్నారు. అభిమానుల మద్దతు, ప్రేమకు ఫిదా అయిపోయిన భారత ఆటగాళ్లు వరల్డ్ కప్ ట్రోఫీని చూపిస్తూ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
Cricket is truly an emotion in India!
And our champions deserve all the love! 😍🇮🇳🏆#VictoryParade pic.twitter.com/S4jOULqetG— Urrmi (@Urrmi_) July 4, 2024
భారీ భద్రత నడుమ..
ఇసుకేస్తే రాలనంత మంది జనంతో టీమిండియా విజయోత్సవ ర్యాలీ వాంఖడే స్టేడియం వైపు వెళ్తోంది. దారికిరువైపులా సైన్యంలా నిలబడిన ఫ్యాన్స్ క్రికెటర్లను కెమెరాలో బంధిస్తూ.. సెల్ఫీలు దిగుతూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ముంబై పోలీసుల భారీ భద్రత నడుమ ర్యాలీ ప్రశాంతంగా సాగుతోంది.
Streets of Mumbai, India 🇮🇳 after T20 World Cup 2024 Victory✌🏻
Streets of Buenos Aires, Argentina 🇦🇷 after FIFA World Cup 2022 Victory✌🏻
The Craze is Unreal 💥#VictoryParade #IndianCricketTeam pic.twitter.com/7Ug5NPZZuN
— Richard Kettleborough (@RichKettle07) July 4, 2024
వాంఖడే స్టేడియానికి చేరుకున్నాక అక్కడ భారత క్రికెట్ బోర్డు (BCCI) వరల్డ్ కప్ విజేతలను ఘనంగా సత్కరించనుంది. అంతేకాదు ముందుగా ప్రకటించిన రూ.125 కోట్ల ప్రైజ్‌మనీని కూడా ఈ మైదానం వేదికగా.. వేలాది మంది ఫ్యాన్స్ చూస్తుండగా చాంపియన్లకు అందజేసే అవకాశముంది. ఈ కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్.. తదితరులు పాల్గొనే చాన్స్ ఉంది.
ALERT 🚨
You are watching the Biggest Fan Base Craze in Cricket History 🏏🇮🇳
Rohit Sharma and Virat Kohli Lifting the ICC T20 World Cup 2024🏆together for first time in front of Craziest Cricket Fans 👏🏻#VictoryParade #IndianCricketTeam pic.twitter.com/LJL3iz8eTN
— Richard Kettleborough (@RichKettle07) July 4, 2024
వర్షాన్ని లెక్కచేయకుండా..
ఢిల్లీ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం ముంబై చేరుకున్న టీమిండియా క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వరల్డ్ కప్ వీరులకు స్వాగతం పలికేందుకు బారులు తీరారు. నారీమన్ పాయింట్ నుంచి మొదలవ్వనున్న విజయోత్సవ యాత్ర కోసం అరేబియన్ సముద్రపు ఒడ్డున లక్షల మంది చేరడంతో వాంఖడే స్టేడియం పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి.
𝙎𝙀𝘼 𝙊𝙁 𝘽𝙇𝙐𝙀! 💙
From #TeamIndia to the fans, thank you for your unwavering support 🤗#T20WorldCup | #Champions pic.twitter.com/GaV49Kmg8s
— BCCI (@BCCI) July 4, 2024
ఇవి కూడా చదవండి
- ntnews.com/…/mumbai-police-issues-alert-on-marine-drive-to-fans-and-people-1645201Singareni | విస్తరణ దిశగా సింగరేణి అడుగులు.. రాజస్థాన్‌లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు..
- Marijuana Seige | ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి తరలింపు.. 16.1 కిలోల గంజాయి పట్టివేత.. ముగ్గురిపై కేసు
- Team India Victory Parade | జనసంద్రమైన ‘మరైన్ డ్రైవ్’.. ముంబైవాసులకు పోలీసుల హెచ్చరిక
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

